లోకల్-నాన్ లోకల్..కుప్పం కోట కూలుతుందా?

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట కుప్పంని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ పాగా వేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ వచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కుప్పంపై ఫోకస్ చేసి టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే కుప్పంలో కొంతవరకు టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు..అటు స్థానిక ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది..కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుంది.

దీంతో చంద్రబాబు పని అయిపోయిందని వైసీపీ శ్రేణులౌ ప్రచారం చేస్తూ వచ్చాయి..అదే సమయంలో బాబు కూడా అలెర్ట్ అయ్యి..వీలు కుదిరినప్పుడల్లా కుప్పం వెళుతూ..అక్కడ పరిస్తితులని చక్కదిద్దుకుంటూ ఉన్నారు. తాజాగా జగన్ కుప్పం వెళ్లారు. అక్కడ 66 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని అక్కడ నుంచే ప్రారంభించారు. ఇక యథావిధిగానే తమ పథకాల గురించి ఉపన్యాసం ఇచ్చారు.

అలాగే అనుకున్న విధంగానే చంద్రబాబుని టార్గెట్ చేశారు..ఇన్నేళ్లల్లో కుప్పానికి చంద్రబాబు ఏమి చేయలేదని,  కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదని, వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందని చెప్పారు. ఇక కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్‌‌కు లోకల్‌..కుప్పానికి చంద్రబాబు నాన్‌ లోకల్‌ అని, ఒక్కసారి కూడా కుప్పం సీటు బీసీలకు ఇవ్వలేదని, చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు లేదు, ఓటు లేదని,  హైదరాబాదే ముద్దు అని చంద్రబాబు భావించారని జగన్ తనదైన శైలిలో విమర్శలు చేశారు.

అయితే ఇలాంటి విమర్శలు చేయడం వల్ల బాబుకు నష్టం జరిగి…వైసీపీకి ఒరిగేది ఏమన్నా ఉందా? అంటే ఏమి లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే కుప్పంకు బాబు ఏం చేశారో..అక్కడి ప్రజలకు తెలుసు. ఇక హైదరాబాద్‌లో ఉండటం గురించి వస్తే..జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక కుప్పం సీటు బీసీలకు అంటే..పులివెందుల ఇంతవరకు వైఎస్సార్ ఫ్యామిలీ తప్ప..మరొకరికి గాని, బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ఇవ్వలేదు. మరి దీన్ని ఏం అంటారని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. అయినా జగన్ ఎన్ని అబద్దాలు చెప్పిన కుప్పం ప్రజలు నమ్మరని, వారికి ఎవరు ఏంటో బాగా తెలుసని చెబుతున్నారు. కుప్పం కోట కూల్చడం కాదు..బాబుని భారీ మెజారిటీతో గెలవకుండా ఆపితే చాలు అంటున్నారు.

Share post:

Latest