వై నాట్ 175: ఫస్ట్ టార్గెట్ కుప్పం..!

ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాప్ నిర్వహిస్తూ..కుప్పంలోని పంచాయితీలు, పరిషత్‌లు, కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకున్నాం కదా..ఇక కుప్పం అసెంబ్లీని కూడా గెలుచుకుంటాం..అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేము అని చెప్పి..ఎమ్మెల్యేలని ప్రశ్నించారు. అంటే 175కి 175 సీట్లు టార్గెట్ అప్పటినుంచి పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నాం..ఈ సారి 175 సీట్లు గెలిచేయాలని అంటున్నారు.

సరే ఈ టార్గెట్ రీచ్ అవుతారా? లేదా అనేది పక్కన పెడితే..ముందు కుప్పంపై మాత్రం గట్టిగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే ముందుకెళుతున్నారు. అక్కడ చంద్రబాబుని దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడి పనిచేస్తున్నారు. అలాగే చాలావరకు రాజకీయంగా కుప్పంలోని టీడీపీ శ్రేణులని వైసీపీ వైపుకు తిప్పుకున్నారు. దీంతో బాబు అలెర్ట్ అయ్యి…అప్పుడప్పుడు కుప్పం పర్యటిస్తూ..అక్కడ పరిస్తితులని సరిచేసుకుంటున్నారు.

ఇటీవల కూడా బాబు కుప్పం వెళ్లొచ్చారు. ఈ క్రమంలోనే జగన్ సైతం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 22న కుప్పం వెళ్ళి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థానపన చేయనున్నారు. అలాగే వైఎస్సార్ చేయూత మూడో విడతని అమలు చేయనున్నారు. ఇక కుప్పంలోని టీడీపీ శ్రేణులని పెద్ద సంఖ్యలో జగన్ సమక్షంలో వైసీపీలోకి తీసుకోచ్చేందుకు స్థానిక వైసీపీ నేతలు కృషి చేస్తున్నారు. భారీ స్థాయిలో సభని నిర్వహించాలని చూస్తున్నారు.

ఇక జగన్ రాక సందర్భంగా భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇదే క్రమంలో కుప్పంలోని గోడల మీద ‘వై నాట్ 175’ ఫస్ట్ టార్గెట్ కుప్పం’ అని వైసీపీ నేతలు రాయిస్తున్నారు. అంటే కుప్పంని ఏ విధంగా టార్గెట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. అయితే 175 దేవుడెరుగు…అసలు కుప్పంలో బాబుని భారీ మెజారిటీతో గెలవకుండా ఆపితే చాలు అని టీడీపీ శ్రేణులు సవాళ్ళు చేస్తున్నాయి. అలాగే పథకాలు కట్ చేస్తామని, రేషన్ కారు కట్ చేస్తామని చెప్పి వైసీపీ నేతలు..బలవంతంగా టీడీపీ వాళ్ళని జగన్ సభలో వైసీపీ కండువాలు కప్పాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా గాని కుప్పంని దక్కించుకోవడం వైసీపీకి అంత ఈజీ కాదనే చెప్పాలి.

Share post:

Latest