హైపర్ ఆది జబర్దస్త్ కు రాననడానికి కారణం అదేనా..?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించారు హైపర్ ఆది. అయితే ఈమధ్య జబర్దస్త్ నుంచి కొంతమంది కమెడియన్లు ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది కూడా బయటికి వెళ్లడం జరిగింది. అయితే హైపర్ ఆది వెళ్లిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి తెలియడం లేదు. కానీ కొంతమంది మాత్రం మల్లెమాల సిబ్బందితో గొడవలు ఉన్నాయని అందుచేతనే జబర్దస్త్ కు దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.Jabardasth Hyper Aadi aka Kota Aadhayya Biography - TFIPOSTకానీ హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. హైపర్ ఆది అభిమానులు మాత్రం హైపర్ ఆదిని తిరిగి జబర్దస్త్ లోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మల్లెమాల సంస్థ హైపర్ ఆదిని జబర్దస్త్ లోకి తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం ఈ క్రమంలోని హైపర్ ఆది కి ప్రస్తుతం ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే 30% అధికంగా ఇస్తామన్న ఈ కార్యక్రమానికి వెళ్లడానికి హైపర్ ఆది ఇష్టపడలేదన్నట్లుగా సమాచారం.Hyper Aadi : హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లను జబర్దస్త్‌ నుండి మల్లెమాల వారు  కావాలని తప్పించారా? | The Telugu Newsఅయితే హైపర్ ఆది వెళ్లకపోవడానికి గల కారణం ఏమిటంటే.. జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది సొంతంగానే స్క్రిప్ట్ తయారు చేసుకోవలసి ఉంటుంది.అది కూడా చాలా సమయం పడుతుంది. అలాగే అధిక ఒత్తిడికి కూడా గురవుతున్న నేపథ్యంలో రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చినప్పటికీ ఆ ఒత్తిడిని తాను భరించలేక జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి వెళ్లే ఆలోచనలు లేనట్లుగా హైపర్ ఆది తన సన్నిహితులతో చెప్పినట్లుగా సమాచారం. మరి హైపర్ ఆది తమ అభిమానుల కోసం తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొంటాడేమో చూడాలి.

Share post:

Latest