ప్రబాస్ ప్రాజెక్ట్ -k సినిమా నుంచి ఆసక్తికరమైన అప్డేట్..!!

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు ఒక్కో సినిమా ఒక అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆది పురుష్ సినిమా నుంచి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు-k వరకు అన్ని భారీ బడ్జెట్ సినిమాలే అని చెప్పవచ్చు. వీటిలో ప్రాజెక్టు కే పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు ఏకంగా ఈ సినిమా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది. అయితే ఇందులో బాలీవుడ్ నటుడు అమితాబ్ తో పాటు, దీపికా పడుకొనే నటిస్తూ ఉండడం గమనార్హం.Project K Trailer | Prabhas | Deepika padukone | Ashwini Dutt | 2024 Movies  | Fan made - YouTubeదీంతో ఈ సినిమా మొత్తం అందరినీ ఆకర్షిస్తోంది. అశ్వని దత్ నిర్మాణ సామర్థ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించడంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని చిత్ర బృందం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. అయితే ఈ సినిమా కథ అన్నది ఏమిటా అనే విషయంపై అందరిలోనూ పలు అనుమానాలు వస్తున్నాయి. దీంతో కొంతమంది ఇది టైమ్ ట్రావెల్ కథ అని ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది. అయితే చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు.Project Kఅయితే తాజాగా వినాయక చవితి పండుగ అయిపోయిన వెంటనే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఒక పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇక ఈ సినిమా కథ పైన అంచనాలను పెంచేలా ఒక పోస్ట్ ను విడుదల చేశారు. సినిమా సెట్స్ లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన చిత్ర యూనిట్ ఒక నోటును విడుదల చేశారు ఇందులో” ఒకప్పుడు వేద వ్యాసునికి మహాభారతం రాయడానికి సహాయం చేశావు ఇప్పుడు మా భారతాన్ని కూడా మీరే ఆశీర్వదించాలి విజ్ఞేశ్వర అని తెలియజేశారు”. దీంతో ఈ సినిమా భారతానికి సంబంధించినది అన్నట్లుగా చెప్పకనే చెప్పారని చెప్పవచ్చు. అయితే ప్రాజెక్టు-k లో కే అనే అక్షరం ఏమిటా అనే విషయంపై పలువురు. మరి ఈ సినిమా నుంచి పూర్తి అప్డేట్ వచ్చేవరకు ఏంటనే విషయం చెప్పలేము అని చెప్పవచ్చు.

Share post:

Latest