ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా: డైరెక్టర్ వి.వి.వినాయక్

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారిన వినాయక్.. తెలుగులో మాస్ కమర్షియల్, కామెడీ సినిమాలను రూపొందించడంతో పేరు పొందారు.. స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్ ఎలివేషన్స్ ఇచ్చేవారు.. జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ఆది సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ‘దిల్’ సినిమా రూపొందించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో మూడో సినిమా బాలయ్యతో తీశారు. భారీ అంచనాలతో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇటీవల చెన్న కేశవరెడ్డి సినిమాను మళ్లీ విడుదల చేశారు. ఇప్పటికీ ఆ సినిమా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం విశేషం..

ఇటీవల వి.వి.వినాయక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అప్పట్లో వచ్చిన రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో తన మూడో సినిమా విజయం అందుకున్న తర్వాత అత్యధికంగా రూ.కోటి పారితోషికం తీసుకున్నారట.. అప్పట్లో అంతకంటే ఎక్కువగా తనకు టాప్ రెమ్యునరేషన్ ఇచ్చారట. చెప్పాలంటే ఇండియాలోనే ఏ డైరెక్టర్ కి ఇవ్వనంత టాప్ రెమ్యునరేషన్ వచ్చినట్లు వినాయక్ చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.. అప్పట్లో మాస్ మూవీస్ కి భారీ హైప్ ఉండేది. అందుకే ఈ డైరెక్టర్ కి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్ వంటి స్టార్లకు వి.వి.వినాయక్ హిట్ సినిమాలు అందించారు. ఇక దిల్ సినిమాతో ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజును పరిచయం చేశారు. చిరంజీవితో తీసిన ఠాకూర్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇక లక్ష్మి సినిమా వెంకటేష్ కు మాస్ హీరోగా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి సినిమా సక్సెస్ కాలేదు. రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ మూవీ విజయం సాధించగా.. ఈ మూవీతో వినాయక్ రొమొంటిక్ కామెడీ దర్శకుడిగా గుర్తింపు పొందారు. అల్లు అర్జున్ తో బన్నీ, అదుర్స్, నాయక్ ఇలా మరికొన్ని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకున్నారు.

అయితే అదుర్స్ తర్వాత వినాయక్ కి సరైన్ హిట్ పడలేదు. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘అఖిల్’ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మెగాస్టర్ చిరంజీవితో చేసిన ఖైదీ నెంబర్ 150 పర్వాలేదు అనిపించింది. కానీ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో చేసిన ఇంటిలిజెంట్ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఇక వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ హీరోతో ఛత్రపతి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే వినాయక్ మళ్లీ నిలదొక్కుకునే అవకాశం ఉంది.