సినిమాలోకి రాకముందు కృష్ణం రాజు ఏం చేసేవారో తెలిస్తే ..ఆశ్చర్యపోతారు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు శకం ముగిసింది. ఎన్నో సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న కృష్ణంరాజు.. ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న కృష్ణంరాజు.. హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ డాక్టర్లు ఎంత శ్రమించినా కృష్ణంరాజు ప్రాణాలను కాపాడలేకపోయారు. హాస్పిటల్ బెడ్ పైన ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న రెబల్ అభిమానులు సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరీ ముఖ్యంగా ప్రభాస్ ని ఆపటం.. ఎవరి తరం కావడం లేదు. కృష్ణంరాజు పార్థీవ దేహం ముందే కూర్చొని ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ని అలా చూడలేకపోతున్నారు. కాగా కృష్ణంరాజు సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే . మొదటగా విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత హీరోగా సెటిల్ అయినా ఘనత కృష్ణంరాజుది. అయితే చాలా మందికి కృష్ణంరాజు సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలియదు . ఆ విషయాలు గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!


టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు 1940 జనవరి 28 వెస్ట్ గోదావరి లోని మొగల్తూరులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆనాటి రాజుల కుటుంబం కావడం నిజంగా విశేషం. కాగ సినిమాలోకి వచ్చాక సింపుల్ గ్వా ఆయన పేరును కృష్ణంరాజుగా మార్చుకునేసారు. అయితే సినిమాలోకి రాకముందు కృష్ణంరాజు ఫోటో జర్నలిస్టుగా పనిచేసేవారట .ఆయన ఆంధ్ర రత్న పత్రికలో ఫోటోగ్రాఫర్ గా పనిచేసేవారు అని సమాచారం. అంతేకాదు ఫోటో జర్నలిస్టుగా ఆయన తీసిన ఫోటోలకు గాను రాష్ట్ర స్థాయిలో సెకండ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా అవార్డు కూడా అందుకున్న ఘనత కృష్ణంరాజుకుంది.

ఆ తర్వాత కూడా ఆయన పలు రకాల అవార్డులు అందుకుంటూ ఫోటో జర్నలిస్టుగా ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కాగా ఆ తర్వాత సడెన్ గా సినిమాలో అవకాశం రావడంతో సినిమాలపై ఉండే మక్కువతో ఫోటో జర్నలిస్ట్ పనిని ఆపేయడం.. ఆ తర్వాత సినీ కెరియర్లో ఫస్ట్ విలన్ గా కొన్నాళ్లు.. ఆ తర్వాత హీరోగా చేసి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు కృష్ణంరాజు. ఏది ఏమైనా కృష్ణంరాజు ఇక లేరు అనే వార్తని రెబల్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.

Share post:

Latest