హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప‌వ‌ర్ గ్లింప్స్ వ‌చ్చేసింది… రిలీజ్ డేట్ కూడా (వీడియో)

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా గ‌త యేడాదిన్న‌ర కాలంగా ఊరిస్తూ వ‌స్తోంది. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాలో ప‌వ‌న్ కుజోడీగా నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మెగా సూర్య మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత ఏఎం. ర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు గ్లింప్స్ ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్ డే కానుక‌గా రిలీజ్ చేశారు.

గ్లింప్స్‌లో ప‌వ‌న్ మ‌ల్ల‌యోధుడిగా కొంద‌రు కుస్తీ యోధుల‌తో ఫైట్ చేసే నిమిషం బిట్ ఉన్న వీడియో రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ చేస్తున్న‌ట్టు వీడియో చూపించారు. ఇక ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉండ‌గా.. వీడియోలో మాత్రం వ‌చ్చే స‌మ్మ‌ర్ బ‌రిలో దిగ‌బోతున్న‌ట్టు చెప్పేశారు.

Share post:

Latest