ఇండియన్ 2 సినిమాకి కమల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలు హీరో కమలహాసన్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన విక్రమ్ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబట్టిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఏకంగా కమలహాసన్ కొన్ని కోట్ల రూపాయలు లాభాలను పొందారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు రూపాయలపైగా వసూలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ -2 సినిమాలో నటిస్తున్నారు.

Bharateeyudu Movie || Maayaamachchendra Video Song || Kamal Haasan, Urmila  - YouTube
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ.. కొన్ని కారణాల చేత గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ కు అంతరాయం కలుగుతూనే ఉంది. ఈ సినిమా ఇటీవల తిరిగి షూటింగ్ ప్రారంభించడం జరిగింది. కమలహాసన్ తో పాటు హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కమలహాసన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి కమల్ హాసన్ ఏకంగా రూ.100 నుంచి 150 కోట్ల రూపాయల లోపు పారితోషం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Indian 2 (2023)
అయితే ఈ విషయంపై చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం గతంలో రికార్డు సృష్టించిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అనురుధ్ అందిస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం కూడా భారతీయుడు అంత సినిమా విజయవంతం కావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.