మూడు రాజధానుల విషయంపై వైసీపీ మరోసారి యూటర్న్ తీసుకుందనే వాదన వినిపిస్తోంది. వాస్తవాని కి.. గత రెండు మాసాలుగా కూడా..మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. అనధికారికంగా.. అయినా.. సీఎం జగన్ .. తన నివాసాన్ని .. విశాఖకు మార్చుకుంటారని.. ప్రచారం జరిగింది. దీనికి కొంద రు మంత్రులుకూడా.. సానుకూలంగానే వ్యాఖ్యలు చేశారు. ఔను.. త్వరలోనే రాష్ట్రంలో అద్భుతం జరు గుతుందని.. వ్యాఖ్యానించారు.
దీంతో ఒక్కసారిగా ఈ విషయం మీడియాలోనూ చర్చకువ చ్చింది. సాధారణంగా.. దసరా పండుగ రోజు.. ఏదైనా మంచి కార్యక్రమాలు మొదలుపెడితే.. విజయం అవుతాయనే నమ్మకం ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ కూడా ఆరోజు నిర్ణయించుకున్నారని.. వ్యాఖ్యలు వినిపించాయి. అంతేకాదు.. ప్రస్తుతం రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర.. విశాఖకు చేరుకునే సరికే.. జగన్ అక్కడ కనిపిస్తారనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది.
అయితే.. ఇప్పుడు ఆ ఊసు ఎక్కడా వినిపించడం లేదు. అంటే.. మూడు రాజధానుల విషయంపై.. వైసీ పీ ప్రభుత్వం ప్రస్తుతానికి.. పక్కన పెట్టిందనే చర్చ జరుగుతోంది. అయితే.. ఇలా ఎందుకు చేశారనే విష యం కూడా ఆసక్తిగా మారింది. మూడు రాజధానులపై.. క్షేత్రస్థాయిలో నాయకులు.. ప్రజల్లోకి బలంగా వా దనను తీసుకువెళ్లలేకపోయారనే వాదన వినిపిస్తోంది. ఇదే విషయంపై వైసీపీలోనూ..చర్చ సాగుతోంది. కీలకమైన నాయకులు.. ఎవరూకూడా మూడుపైప్రజల్లోకి వెళ్లిన పరిస్తితిలేదు.
ఒకవైపు.. మూడు రాజధానులు వద్దంటూ.. టీడీపీ నాయకులు.. రైతులు.. ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ, అదే వైసీపీ నాయకులు.. మూడు రాజధానులకు మద్దతుగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. అంటే.. ఈ విషయంలో వైసీపీలోనే ఎక్కడో తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ పరిణామాలనే అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ప్రస్తుతానికి విశాఖ నుంచి పాలనపై..యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.