ఆ హీరోయిన్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టమట..

టాలీవుడ్ మెగాస్టార్ ఎవరంటే గుర్తొచ్చేది చిరంజీవి.. ఇండస్ట్రీలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తి..సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూసిన రోజు నుంచి ఒక సినిమాల్లో ఏ ఆర్టిస్ట్ అయితే బాగుంటారో శాసించే స్థాయికి ఎదిగారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. తన టాలెంట్ తో తెలుగు ఇండస్ట్రీలో ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్ మొదట్లో ఎంతో కష్టపడ్డ ఆయన తన సినిమాలో ఆ హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలకు చెప్పే స్థాయికి చిరంజీవి ఎదిగారు..

అలాంటి హీరోయిన్ లలో మాధవి ఒకరు. 90లలో మాధవిని చిరంజీవి రెకమెండ్ చేసే వారట..వాస్తవానికి సినీ పరిశ్రమలో ఎంతో మంది అందమైన హీరోయిన్లు ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి మాధవిని ఆయన ఎక్కువగా రెకమెండ్ చేసేవారు. ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే మాధవి కలర్ విషయంలో కాస్త తక్కువ.. అయితే చామన ఛాయతో ఆకట్టుకునే ముఖ వచ్చస్సుతో మాధవి అలరించింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అందుకే చిరంజీవికి మాధవి అంటే ప్రత్యేక అభిమానం.. తన సినిమాల్లో ఎక్కువగా మాధవిని తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సలహాలు ఇచ్చేవారట..

చిరంజీవికి హిట్ జోడిగా పేరు తెచ్చుకుంది మాధవి..ముఖ్యంగా వారి కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. ఈ సినిమాలో రగులుతోంది మొగలిపొద అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. ఈ మూవీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా.. ఈ సినిమా ఏకంగా 500 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి కెరీర్ మలుపు తిరిగింది. అందుకే ఆ సినిమా తర్వాత విజయశాంతి, రాధ, రాధికా, సుహాసిని ఇలా ఎవరి కాంబినేషన్ అయినా మాధవిని చిరంజీవి రెఫర్ చేసేవారట..