హిట్ కోసం కళ్యాణ్ రామ్ ని ఫాలో అవుతున్న చిరంజీవి… గాడ్ ఫాదర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటం పక్క..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళీ సూపర్ హిట్ లూసీ ఫర్ సినిమాకి రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ చాలా స్లోగాఉన్న.. గత వారం రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లపై చిత్ర యూనిట్ బాగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందని తెలుస్తుంది.

GodFather' First Look: Megastar Chiranjeevi slays in style as powerful  politician – ThePrint – ANIFeed

సెన్సార్ పూర్తయిన తర్వాత ఈ సినిమాలో కొన్ని సీన్లను రీషుట్ చేస్తున్నట్లు కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి.. తాజాగా వచ్చిన వార్త ఏమిటంటే ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ను రీ షూట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ సాంగులో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, చిరంజీవి ఆడి పాడినట్లు తెలుస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇటీవల వచ్చిన బింబిసార సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసిన ముంబై బ్యూటీ మరీనా హుస్సేన్ ను ఈ సాంగులో ఎంపిక చేసినట్టుు తెలుస్తుంది. మరో ప్రచారం ఏమిటంటే ఈ సాంగులో ప్రత్యేకంగా చిరంజీవితోనే షూట్ చేశారని అంటున్నారు.

ఈ సాంగ్ అను చోట కే నాయుడు షూట్ చేశారని కూడా తెలుస్తోంది. సీనియర్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా రూపొందించాడు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాథ్, సముద్రఖని వంటి వారు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.