నెల్లూరు తమ్ముళ్లకే బాబు షాక్?

ఏదేమైనా ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలనే కసితో పనిచేస్తున్న చంద్రబాబు…ఆ దిశగానే దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార వైసీపీపై గట్టిగా పోరాడుతున్నారు. ఇక ఎవరైతే అధికార పార్టీపై పోరాటం చేయకుండా, అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వచ్చి పనిచేసే నేతలకు తాజాగా బాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఎప్పుడూలేని విధంగా నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంచార్జ్‌లు ఖచ్చితంగా నెలకు 20 రోజులు నియోజకవర్గంలో పనిచేయాలని సూచించారు.

అలా పనిచేయని వారిని మొహమాటం లేకుండా తీసి పక్కన పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. తాను ఊరికే పైపైన హెచ్చరికలు చేసి ఊరుకొంటానన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉందని, ఇవ్వగలిగినంత వరకూ అవకాశం ఇస్తానని… తర్వాత పక్కన పెట్టేస్తానని బాబు..నేతలకు క్లియర్ గా చెప్పేశారు. దీంతో టీడీపీ నేతలు అలెర్ట్ అవుతున్నారు. ఎవరు సీటుకు ఎసరు వచ్చి పడుతుందో అని టెన్షన్ పడుతున్నారు. అయితే ఇప్పుడు బాబు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఓకే…ఇక నుంచి ఎలా పనిచేస్తారనేది చూడాలి.

అయితే బాబు వార్నింగ్ అనేది నెల్లూరు టీడీపీ నేతలకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో పెద్దగా దూకుడుగా పనిచేయని నేతలు ఎవరంటే నెల్లూరు టీడీపీ నేతలే. పైగా ఇక్కడ విచిత్రం ఏంటంటే…టీడీపీ నేతలు…వైసీపీ వాళ్ళతో లోపాయికారి ఒప్పందం చేసుకుని…సఖ్యతగా మెలుగుతూ పార్టీకే డ్యామేజ్ చేస్తారు. అసలు స్థానిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడానికి సగం కారణమే టీడీపీ నేతలే.

గత ఎన్నికల్లో జిల్లాలోని 10 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది…అయితే ఇందులో ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు…దాదాపు సగం మందిపై వ్యతిరేకత ఉంది. అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో టీడీపీ పికప్ అవ్వలేదు. కానీ అనుకున్నట్లుగా టీడీపీ పికప్ అవ్వలేదు. దీనికి కారణం టీడీపీ నేతలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే. మరి ఇప్పుడు బాబు వార్నింగ్ ఇచ్చారు కదా…ఇకనైనా సరిగ్గా పనిచేస్తారో లేదో చూడాలి. పనిచేయకపోతే బాబు మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తారు.