బాబు హిట్‌… వైసీపీలో గుబులు ప‌ట్టుకుందా…!

ఒక్కొక్క‌సారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయ‌కుల వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నంగా మారుతుం టాయి. గ‌త ఎన్నిక‌ల్లో 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నాం.. కేవ‌లం 23 మంది మాత్ర‌మే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ న‌లుగురిని.. వైసీపీవైపు మ‌ళ్లించుకున్నారు. ఇక‌, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. సో.. దీనిని బ‌ట్టి.. వైసీపీ నేత‌లు.. ఏమ‌నుకున్నారంటే.. “వీరు మ‌న‌ల్ని ఏం చేస్తారు.. లే!“ అని.

కానీ, ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నార‌నే విష‌యంతో సంబంధం లేకుండా.. టీడీపీ అధినేత చంద్ర‌బా బు ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. అదేస‌మ‌యంలో జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. నాయ‌కుల‌తోనూ మాట్లాడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు.. అనే మాట ప‌క్క‌న పెట్టి.. చంద్ర‌బాబు వాయిస్ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది. ఆయ‌న మాట‌ల‌ను ప్ర‌జ‌లు కూడా విశ్వ‌సిస్తున్నారు.

ఈ ప‌రిణామ‌మే.. ఇప్పుడు వైసీపీలో గుబులు రేపుతోంది. చంద్ర‌బాబు మాట‌ల‌ను.. ఆయ‌న చేస్తున్న ప్ర‌చారాన్ని.. ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌నే వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి చంద్ర‌బాబు చేసే ప్ర‌చారాన్ని ఆదిలో వైసీపీ నాయ‌కులు కొట్టిపారేశారు. ఆ.. ఏముంది.. అంతా డ‌బ్బా.. అని అన్న నాయ‌కులు ఇప్పుడు సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌చారానికి భారీ ప‌వ‌ర్ ఉండ‌డ‌మే.

ఈ క్ర‌మంలోనే తాజాగా అసెంబ్లీ స‌మావేశాల్లో.. సీఎం జ‌గ‌న్‌.. స్వ‌యంగా.. దీనిపై మాట్లాడారు. `చంద్ర బాబు చేస్తున్న ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారేమో.. “ అని వ్యాఖ్యానించారు. అందుకే.. ఏకంగా.. అప్పులు.. ఆర్థిక స‌మాచారం. సంక్షేమ ప‌థ‌కాలు.. అమ‌రావ‌తి రాజ‌ధాని.. ఇలా అన్ని అంశాల‌ను స‌భా ముఖ్ంగా.. పిల్ల‌ల‌కు వివ‌రించిన‌ట్టు విచారించ‌డం గ‌మ‌నార్హం.

త‌న హ‌యాంలో చేసిన అప్పులు.. చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన అప్పుల‌ను ఆయ‌న హ‌యాంలో చేసిన అప్పుల‌కు మ‌ధ్య సారూప్య‌త‌ను కూడా చాలా ఓపిక‌గా.. నాలుగు గంట‌ల పాటు వివ‌రించారు. దీనిని బ‌ట్టి .. జ‌గ‌న్ ఎక్క‌డో జంకుతున్నార‌నే భావ‌న ఏర్ప‌డుతోంద‌ని అంటున్నారు పరిశీల‌కులు చెబుతున్నారు. చంద్ర‌బాబు ప్ర‌చారం. త‌న‌కు ముప్పు తేవ‌డం ఖాయ‌మ‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.

Share post:

Latest