అంచ‌నాలు పెంచేసిన బ్ర‌హ్మాస్త్రం ప్రోమో… విజువ‌ల్ వండ‌ర్ ( వీడియో)

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ – ఆలియా భట్ హీరో హీరోయిన్ లుగా తెర‌కెక్కిన సినిమా బ్ర‌హ్మాస్త్ర. తెలుగులో నే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నెల 10న బ్ర‌హ్మాస్త్రం థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నాగార్జున కూడా న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి.

బ్ర‌హ్మాస్త్ర నుంచి తాజాగా రిలీజ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మ‌న దేశం నుంచి ఓ బిగ్గెస్ట్ సూప‌ర్ హీరోస్ సినిమాలా ఈ సినిమా ఉంటుంద‌ని మేకర్స్ చెపుతున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో అయితే వేరే లెవ‌ల్లో ఉంద‌నే చెప్పాలి. ఈ ప్రోమోలో విజువ‌ల్స్ చాలా గ్రాండియ‌ర్‌గా ఉన్నాయి. అయితే వీటిని థియేట‌ర్స్‌లో చూసిన‌ప్పుడు ఖచ్చితంగా మంచి ట్రీట్ వ‌స్తుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.

అయితే ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఖ‌చ్చితంగా మ్యాజిక్ చేస్తుంద‌న్న న‌మ్మ‌కాలు ఉన్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు సౌత్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తుండ‌డంతో అంచ‌నాలు మ‌రింత‌గా ఉన్నాయి.

Share post:

Latest