ఏపీ ప్ర‌జ‌ల‌పై బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్‌… ఈ సారి న‌మ్మలేమా….!

రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ ని.. ఇటీవ‌ల కాలంలో ప‌దే ప‌దే చెబుతున్న రాష్ట్ర క‌మ‌ల‌నాథులు.. రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌లోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతుల ప‌క్షాన కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు.. రాజ‌ధాని విష‌యంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తీరు మారింద‌ని.. త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌ని.. రైతులు భావిస్తున్నారు.అందుకే.. వారు చేస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ.. బీజేపీ నేత‌ల‌ను కూడా ఆహ్వానిస్తున్నారు.

WatchOut: AP BJP Continue To Suspend Even Main Party Leaders On Burning  Issue Of Amaravathi | Galli 2 Delhi Telugu News

అయితే.. ఇప్పుడు బీజేపీ నేత‌లు.. మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్నూలులో రాష్ట్ర హైకోర్టును ఏర్పా టు చేసేందుకు బీజేపీ కేంద్ర పాల‌కులు.. సిద్ధంగా ఉన్నార‌ని.. వారిపై తాము కూడా ఒత్తిడి తెచ్చి.. క‌ర్నూ లుకు న్యాయం చేస్తామ‌ని.. సోము వీర్రాజు ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడు మ‌ళ్లీ.. రాజ‌ధానిపై బీజేపీ తొండా ట ఆడుతోందా? అనే సందేహాలు రైతులు వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే.. రైతుల దృష్టిలోను.. వారు చేస్తున్న ఉద్య‌మంలోనూ.. రాజ‌ధాని అంటే.. హైకోర్టు-శాస‌న స‌భ‌-స‌చివాల‌యం అన్నీ క‌లిపిన రాజ‌ధాని కోసం .. పోరాడుతున్నారు.

Amaravathi : అమ‌రావ‌తికి ఏపీ బీజేపీ అండ‌..21న రైతుల‌తో నేత‌ల పాద‌యాత్ర | BJP  Padayathra For Amaravathi Farmers

అంతేకానీ.. హైకోర్టులేని రాజ‌ధాని అని వారు భావించ‌డం లేదు. సో.. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కు లుచేసిన ప్ర‌క‌ట‌న రైతుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. ఇది.. నోటితో మాట్లాడుతూ.. నొస‌టితో వెక్కిరించిన ట్టుగానే ఉంద‌నే అభిప్రాయం రైతుల‌కు క‌లుగుతోంది. అదేస‌మ‌యంలో ఈ నెల 27న విభ‌జ‌న హామీల‌పై రెండురాష్ట్రాల‌తోనూ చ‌ర్చించాల‌ని.. కేంద్రం నిర్ణ‌యించుకుంది. అదేస‌మ‌యంలో రాజ‌ధానికి నిధుల ప్ర‌స్తావ‌న కూడా తెచ్చింది. కానీ, ఈ ప్ర‌క‌ట‌న‌లో నిర్దిష్టంగా.. ఒకే ఒక్క రాజ‌ధాని అమ‌రావ‌తికి తాము నిదులు ఇస్తున్నామ‌ని.. ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు.

ఈ ప‌రిణామంపైనా..రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌తో బీజేపీ ఆడుకుంటోందా? అనే సందేహా లు వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఏపీ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వ్య‌వ‌హ‌రించే ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని.. ఇది దారుణ‌మ‌ని మ‌రికొందరు రైతులు పేర్కొంటున్నారు. రాజ‌ధాని అంటే.. హైకోర్టు కూడా ఉండాల‌ని.. అలాంటిది.. ఇప్పుడు హైకోర్టును మారిస్తే.. అది త‌మ‌కు అన్యాయం చేసిన‌ట్టు కాదా? అని రైతులు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో బీజేపీ తొండాట‌పై.. రైతు నేత‌లు.. గుర్రుగా ఉన్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Share post:

Latest