బేబమ్మ కష్టాలు మామూలుగా లేవుగా.. మరి కెరియర్..?

ఉప్పెన సినిమాతోనే ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈమెకు వచ్చిన ఆఫర్లు ప్రతి ఒక్కరిని ఓకే చేయకుండా.. కేవలం డైరెక్టర్లను దృష్టిలో పెట్టుకొని ఆమె సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉన్నది. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత ఈమె నటించిన ఏ చిత్రాలు కూడా పెద్దగా విజయాలు అందుకోలేకపోతోంది.

Actress Krithi Shetty Reveals Her Celebrity Crush, It's Sivakarthikeyan

ఇక వీటికి తోడు ఆమె పక్కన ఏ హీరోతోనైనా నటిస్తే చాలా చిన్న పిల్లలా కనిపిస్తుంది అంటూ కొంతమంది యువ హీరోలు సైతం భావిస్తూ ఉండడంతో ఈమె మీడియం హీరోలతో సరి పెట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఘోరంగా డిజాస్టర్ గా మిగిలాయి. ప్రస్తుతం ఈమె కెరియర్ చాలా కష్టాల్లో ఉందని చెప్పవచ్చు. వీటికి తోడు ప్రస్తుతం ఈ తరం ఎక్కువగా రష్మిక, పూజా హెగ్డే వంటి హీరోయిన్లతో సమానంగా ఈమె ఎంతటి ఎక్స్పోజింగ్ చేసినా అంతగా గుర్తింపు రావడం లేదు.

Krithi Shetty: బంపరాఫర్‌ కొట్టేసిన కృతిశెట్టి.. ఏకంగా పాన్‌ ఇండియా  స్టార్‌కు జోడిగా..? | According to latest buzz actress krithi shetty got  chance in prabhas and maruti movie | TV9 Telugu

ఇక ఆమె నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా లో హీరో సుదీర్ బాబు పక్కన నటించింది. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా ఒక విభిన్నమైన కథ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడు విడుదల కావాల్సి ఉండగా కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి కెరియర్ కూడా అంతగా బాగోలేదని చెప్పవచ్చు. ఒకవేళ ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ అయితే హ్యాట్రిక్ ఫెయిల్యూర్ హీరోయిన్ అనే ముద్ర పడిపోతుందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ శ్రీ లీల పలు అవకాశాలను సంపాదించుకుంటూ ఉండగా.. ప్రస్తుతం కృతి శెట్టి కష్టాల్లో ఉందంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest