హ..హ…హ..సప్తగిరి కామెడీ నచ్చి బాలయ్య ఏం చేసాడో చూడండి(వీడియో)..!!

నందమూరి బాలకృష్ణ..ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. నందమూరి నటవరసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరో ..యంగ్ హీరోలకు సైతం దడ పుట్టిస్తున్నారు . యంగ్ హీరోలు రెండు సంవత్సరాలకి ఒక సినిమాను కమిట్ అవుతుంటే.. బాలయ్య మాత్రం సంవత్సరానికి రెండు మూడు సినిమాలు ఓకే చేసి ..అనుకున్న విధంగానే షూటింగ్ కంప్లీట్ చేస్తూ డైరెక్టర్ కి మేకర్స్ కి నిర్మాతలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న సీనియర్ హీరో.

మనకు తెలిసిందే బాలయ్య ప్రజెంట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో NBK107 అనే చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 అనే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయిన బాలయ్య ఏ మాత్రం తనలోని ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఫుల్ హుషారుగా ఉన్నారు. రీసెంట్ గా బాలయ్య లోని ఎనర్జీ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కమెడియన్ సప్తగిరి కూడా NBK107 సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ ఫారెన్లో జరుగుతుంది. కాగా ఇప్పుడు బాలయ్య సప్తగిరి కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో సప్తగిరి యాక్టింగ్ ఫిదా అయిన బాలకృష్ణ హ్యాపీనెస్ లో సప్తగిరి కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే అప్పుడే సప్తగిరి సార్ సార్ అంటూ బాలకృష్ణ కాళ్లు పట్టుకొని నవ్వడం అందరిలో నవ్వులు పూయిస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది. ఇది చూసిన నందమూరి అభిమానులు జై బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం మనము చెబుదామా జై బాలయ్య.. జై బాలయ్య..!!

Share post:

Latest