ఆ హీరోల రికార్డు బ్రేక్ చేసిన బాలయ్య మూవీ..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలను అభిమానులు తమ పాత సినిమాలను విడుదల చేసి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రాలు USA వంటి ప్రాంతాలలో కూడా విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్న సినిమాలను 4K విజువల్స్ తో విడుదల చేయడం జరిగుతోంది. దీంతో థియేటర్లకు వెళ్లి మరి ఎవరు చూస్తారు అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతూ ఉంటాయి.

Chennakesava Reddy | Watch Full Movie Online | Eros Now
ఇక గతంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాని రీ రిలీజ్ చేయడం వల్ల ఆ అనుమానాలకు స్వస్తి పలికేలా చేశాయి. ఈ చిత్రం కోటిన్నరకు పైగా వసూళ్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాని కూడా రీ రిలీజ్ చేయగా.. రూ.3 కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది. ఇక ఆ తర్వాత చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానా మొగుడు చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా .. ఈ సినిమాపై ప్రేక్షకులకు అభిమానులకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో కేవలం రూ.50 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది.

May be an image of 2 people
అయితే సెప్టెంబర్ 25న బాలకృష్ణ ,V.V వినాయక్ కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలోనే USA లో ఈ సినిమా ఓపెనింగ్ చేయగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ చిత్రానికి ఏకంగా $25K డాలర్లను వసూలు చేయడం జరిగినట్లు తెలుస్తోంది. అయితే పోకిరి చిత్రం రీ రిలీజ్ టైం లో మాత్రం $15 K డాలర్లను మాత్రమే వసూలు చేసింది. ఇక జల్సా సినిమా మొత్తంగా $37K డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఇప్పుడు తాజాగా చెన్నకేశవరెడ్డి సినిమా $25 K డాలర్లను వసూలు చేయడంతో జల్సా రికార్డును సైతం బ్రేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాలలో ఇ చిత్రాన్ని 300 థియేటర్లకు పైగా విడుదల చేస్తున్నారు. ఇక అలా వచ్చిన కలెక్షన్లను బసవతారకం హాస్పిటల్ కు డొనేట్ చేయబోతున్నట్లుగా బెల్లంకొండ సురేష్ తెలిపారు.

Share post:

Latest