ఒక్క హిట్ పడగానే రూట్ మార్చిన అను..పోస్ట్ వైరల్..!!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ త్రివిక్ర‌మ్‌ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. అనుపమ పరమేశ్వరన్ అప్ప‌టినుంచి తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కార్తికేయ2 లాంటి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాతో ఈమెకు మంచి ఇమేజ్ వచ్చింది. వ‌రుస‌ సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదిక‌గా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనుపమ కార్తికేయ2 సినిమా హిట్ తర్వాత అనుప‌మ బిహేవియ‌ర్‌లో చాలా మార్పులు వ‌చ్చాయి. ఇదే క్రమంలో తన సోషల్ మీడియా వేదికగా ఈమె జీవిత స‌త్య‌లు గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది. మనం ఎలా సంతోషంగా బతకాలి అనే జీవిత పాఠాలను అనుపమ చెప్పింది.

Actress Anupama Parameswaran Cute Video | Anupama Parameswaran Latest Cute Videos | Wall Post - YouTube

“మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి మంచిగా ఆలోచించాలి అలా ఉంటేనే మన జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని”. అనుపమ తన సోష‌ల్ మీడియాలో జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో నెటిజెన్స్‌ కార్తికేయ2 తర్వాత అనుపమకి జ్ఞానోదయం అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Share post:

Latest