ఆ విషయంలో హర్ట్ అయిన అల్లు శిరీష్..ఇల్లు వదిలి వెళ్లిపోయాడా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాటిలో నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు మంచి పేరు ఉంది. వీరితో పాటు అల్లు కుటుంబాన్ని కూడా మంచి పేరు ఉంది. స్వర్గీయ అల్లు రామలింగయ్య నట వారసుడిగా అల్లు అరవింద్ తెలుగు పరిశ్రమలకు వచ్చారు. ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు వారు కూడా తెలుగు పరిశ్రమలోకి వచ్చి వారి ఇమేజ్‌ను పెంచుకొనే పనిలో ఉన్నారు.

అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి తండ్రి బాటలోనే సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ బిజీ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. అల్లు అర్జున్ తాత నట వారసత్వాని పునికి పుచ్చుకొని తెలుగులో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. తాజాగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి ఇమేజ్‌ను తెచ్చుకున్నాడు. అయితే అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ అడపాదడపా సినిమాలు తీసిన మంచి పేరు రాకపోవడంతో ప్రస్తుతం సినిమాలు కు దూరంగా ఉన్నాడు. తాజాగా ఇప్పుడు అల్లు శిరీష్ పై సోషల్ మీడియాలో ఒక వార్త బయటకు వచ్చింది. అల్లు శిరీష్ తన తన తండ్రి- అన్నలతో గొడవలు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆ గొడవలు ఇప్పుడు పెద్దవి అయినట్టు తెలుస్తుంది. అల్లు శిరీష్ తో పాటు వచ్చినిన హీరోలు అందరూ మంచి స్టార్ డమ్ క్రియేట్ చేసుకుని సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయారు. అయితే అల్లు శిరీష్ మాత్రం సినిమాల్లో చేయకుండా ఖాళీగా మిగిలిపోయాడు. తన తండ్రి అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ ప్రమోట్ చేసిన‌ట్టు అల్లు శిరీష్ ని పట్టించుకోలేదు అల్లు శిరీష్ అసహనానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముంబైలో ఒంటరిగా ఉంటున్నాడని తెలుస్తుంది.

తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే అది నిజమే అని తెలుస్తుంది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు అందరూ ఒకచోటన పాల్గొని వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. అయితే వారిలో అల్లు శిరీష్ లేకపోవటం ఈ గొడవలను మరింత పెద్ద అయ్యాయని తెలుస్తున్నాయి. గొడవలపై క్లారిటీ రావాలంటే అల్లు శిరీష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఏ ఈవెంట్లో అయినా పాల్గొంటే ఈ వార్తలు సర్దు మనుగతాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest