‘ఏజెంట్’ బ్యూటీకి క్యూకట్టిన ఆఫర్లు..

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాలో స్టార్ హీరో మమ్ముట్టి విలన్ గా నటిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది..ఇది ఆమెకు ఫస్ట్ సినిమా.. అయితే ఏజెంట్ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయినా ఈ బ్యూటీకి తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి..

ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ల కొరత అల్లాడుతోంది.. అందుకే కొత్త హీరోయిన్ల అవసరం చాలా ఏర్పడింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, రష్మిక మందన్న స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఉప్పెన సినిమాతో ఓ ఊపు ఊపిన కృతి శెట్టి ఇప్పుడు వరుస డిజాస్టర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక బాలీవుడ్ భామలు కియారా అద్వానీ, అలియా భట్ మాత్రం హిందీ సినిమాల తర్వాత వేరే ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. ఈక్రమంలో ‘ఏజెంట్’ బ్యూటీకి అవకాశాలు తలుపు తడుతున్నాయి..

మహారాష్ట్రకు చెందిన సాక్షి వైద్య చదువు పూర్తి కాగానే ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది. కొన్ని టీవీ ప్రచార చిత్రాల్లోనూ నటించింది. మోడల్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఈక్రమంలో బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆమెకు తెలుగులో ఏజెంట్ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఆమె గ్లామర్ తో ఆకట్టుకోవడంతో ఈ సినిమా చేస్తుండగానే ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శీను తెరకెక్కిస్తున్న సినిమాలో సాక్షి వైద్యను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.. అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆ సినిమాకు సాక్షి వైద్యను హీరోయిన్ గా లాక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.. ఈ సినిమా కోసం రామ్ తన హెయిర్ స్టయిల్ మార్చి కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక బోయపాటి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్లు ఓ రేంజ్ లో ఉంటాయి. మరీ ఆయన రామ్ ని ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.