సీరియల్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన టాప్ స్టార్లు ఎవరో తెలుసా?

ఇండియాలో కొందరు స్టార్లు సీరియల్స్ నుండి వచ్చి, వివిధ సినిమా పరిశ్రమలలో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. అందులో ముందు వరుసలో ఉంటాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. అవును, ‘దిల్ దరియా’ అనే సీరియల్ లో షారుక్ మొదటగా నటించాడు. అయితే అందులో ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేయడం కొసమెరుపు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో చేసి, దీవానా అనే సినిమా ద్వారా వెండి తెరపై మెరిశాడు. ఈ క్రమంలో బాలీవుడ్లోనే శక్తివంతమైన హీరోగా వెలుగొందాడు.

ఆ తరువాత మనం ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇతను ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్ లో మానవ్ అనే క్యారెక్టర్ చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు కొన్ని అనూహ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ప్రముఖ దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ సైతం టీవీ నుంచే సినిమాల్లోకి రావడం విశేషం. అనంతరం హాలీవుడ్ లోనూ తిరుగులేని నటుడిగా ఎదిగాడు. చాణక్య, చంద్రకాంత లాంటి 10 టాప్ సీరియల్స్ లో ఆయన నటించారు.

ఇక మొత్తం ఇండియా సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ నటుడు ప్రకాష్ రాజ్. ఇతనుకూడా మొదట నాటకాలు, సీరియల్స్ లో నటించాక సినిమా అవకాశాలు ఈయనని వెతుక్కుంటూ వచ్చాయి. ఇక సంతోషం చిత్రంలో నాగార్జున సరసన నటించిన గ్రేసీ సింగ్ గురించి తెలిసే ఉంటుంది. ఈమె కూడా ‘అమానత్’ అనే సీరియల్ ద్వారా యాక్టింగ్ రంగంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. ఈమె కూడా సీరియల్స్ ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక KGF సినిమాతో దేశ వ్యాప్తంగా టాప్ హీరోగా గుర్తింపు పొందిన యశ్ కూడా మొదట సీరియల్స్ లో నటించాడు. తన భార్య రాధిక కూడా సీరియల్ నటి అన్న విషయం తెలిసినదే.

Share post:

Latest