బుట్టబొమ్మ పూజా హెగ్డే.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట కుర్రకారు ఈమెకి ఫిదా అయిపోయారు అంటే నమ్మితీరాల్సిందే. ఇక ఈ పొడుగు కాళ్ళ సుందరికి ఇక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది. మొదట ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనిపించుకున్న అమ్మడు రోజులు గడుస్తున్న కొద్దీ అదృష్టం కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆమె డేట్స్ కోసం క్యూ కట్టే పరిస్థితి వుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పూజాకు మంచి విజయాలను అందించాయి. దీంతో ఈ అమ్మడి దశ ఒక్కసారిగా తిరిగింది.
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్లో పలు ప్రాజెక్టులతో బిజీగా వుంది. అందుకే హైదరాబాద్ టు ముంబై జర్నీ చేయక తప్పడంలేదు ఈ ముద్దుగమ్మకి. రీసెంట్గా ఈ బుట్టబొమ్మ ముంబైలో ఒక ఇల్లు కూడా తీసుకుందని వార్తలు వచ్చాయి. షూటింగ్ కోసం ముంబై వెళ్లినపుడల్లా అక్కడే ఉంటుందట. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ రోడ్డులో జిమ్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది పూజా. టైట్ ఫిట్ డ్రెస్.. సన్ గ్లాసెస్ పెట్టుకున్న బుట్టబొమ్మ.. బిగుతైన అందాలను ప్రదర్శిస్తూ కుర్రోళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
లైట్ కలర్ డ్రెస్ ధరించిన పూజాకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే పూజా సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులను ఖుషీ చేసేందుకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన పిక్స్ అప్డేడ్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్స్, పలు మాల్స్‌లలో దర్శనమిస్తూ సందడి చేస్తుంది. ప్రస్తుతం జీరో సైజ్ మెయింటెన్ చేస్తున్న పూజా.. ఈమధ్య ఎందుకనో కాస్త లావుగా కనిపిస్తుంది.