వామ్మో..నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి అన్ని కోట్లు కూడబెట్టిందా.. టోటల్ ఆస్తి లెక్కలు ఇవే ..!?

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. నయనతార 2003లో అయ్యా సినిమాతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ కొనసాగుతూ వచ్చింది. నయనతార తర్వాత తెలుగు, కన్నడ ,మలయాళం భాషల్లో నటిస్తూ ఆ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. నయనతార ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ రెమ్యూనిరేషన్ తీసుకునే నటిగా ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళింది. ఈమె దీంతో పాటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీవబోతుంది. తాజాగా నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Celebrities thronging Nayanthara-Vignesh Sivan's marriage | cinejosh.com

నయనతార ఇప్పటివరకు సౌత్ భాషలలో 75 సినిమాల్లో నటించింది. ఇప్పుడు నయనతార తను చేసే ప్రతి సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ నయనతార గురించి మనకు తెలిసిన విషయాలు కావచ్చు.. కానీ ఇప్పుడు ఈమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే.. నయనతార ఇప్పటివరకు తన సంపాదించిన ఆస్తి విలువ ఏకంగా 165 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.

Happy birthday Nayanthara: 5 lesser known facts about the actress |  Celebrities News – India TV

నయనతార సినిమాలలోని నటిస్తూ పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. దీనికి నయనతార ఒక్కో సంస్థకు 5 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఈమెకు హైదరాబాదులో రెండు ఖరీదైన బంగ్లాలో, చెన్నైలో ఈమెకు నాలుగు ఫ్లాట్లు, సొంత రాష్ట్రం అయిన‌ కేరళలో ఒక భారీ ప్యాలెస్, దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో ఈమె కు బిల్డింగ్ లో ఉన్నట్టు సమాచారం. అయితే హైదరాబాదులో ఉన్న ఒక్కో ఫ్లాట్ విలువ సుమారు 15 కోట్ల విలువ చేస్తుందని తెలుస్తుంది. నయనతార ఇటీవ‌ల సొంత జెట్‌ విమానాన్ని కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. నయనతార సినిమా రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతుంది. వీటితోపాటు సినిమా నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ బాగానే సంపాదిస్తుందని తెలుస్తుంది.

Share post:

Latest