నో డౌట్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఆమెనే..పాపం..?

భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకి రసవత్తరంగా మారింది. ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు, గిల్లికజ్జాలు, గాసిప్లు ఇలాంటివి ఉంటేనే సీజన్స్ ఎక్కువ వస్తాయి. షో ముందుకెళ్తుంది. ప్రొడ్యూసర్స్ కి లాభాలు వస్తాయి . సైలెంట్ గా ఉన్నది ఉన్నట్లు చూపిస్తే అది బిగ్ బాస్ అవ్వదు కదా. కచ్చితంగా బిగ్ బాస్ గొడవ పెడతాడు.. కంటెస్టెంట్ల మధ్య.. అప్పుడే కంటెస్టెంట్లకి తగిన పారితోషకం కూడా వస్తుంది.

బిగ్ బాస్ చూసే వాళ్ళకి కచ్చితంగా ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతివారం హౌస్ లో నుండి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వస్తారు. కాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫస్ట్ వారానికి సంబంధించి నామినేట్ అయిన కంటెస్టెంట్లలో ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి నామినేషన్ లో అందరూ రేవంత్ ని నామినేట్ చేశారు అందరికన్నా హైయెస్ట్ నామినేటెడ్ ఓట్లు వచ్చింది కూడా రేవంత్ కే. ఈ క్రమంలో రేవంత్ కి స్టార్ సింగర్స్ అందరూ బలంగా సపోర్ట్ చేయడంతో అత్యధిక ఓట్లు పోలైనట్టు తెలుస్తుంది. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్లను చూస్తే రేవంత్ , ఫైమ, చంటి, శ్రీ సత్య ,ఆరోహి ,ఇనయా సుల్తానా ,అభినయ వీరు ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు.

కాగా వీళ్ళల్లో అత్యధికంగా రేవంత్ కి టాప్ ఓట్లు పోలైనట్టు సమాచారం. కాగా ఆ తర్వాతి స్థానంలో ఫైమా, ఆ తర్వాతి స్థానంలో శ్రీ సత్య ,చంటి, కి ఎక్కువ ఓట్ల వచ్చిన్నట్లు తెలుస్తుంది .ఇక లాస్ట్ త్రీ మెంబర్స్ గా డేంజర్ జోన్ లో అభినయ ,ఇనాయా సుల్తానా .ఆరోహి ఉన్నారు . వీళ్ళల్లో ఇనాయా సుల్తానా, అభినయ మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచిన్నత్లు సమాచారం. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఇనాయా సుల్తానా ఎలిమినేట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ అయిపోయింది . దీంతో బిగ్ బాస్ లీక్ రాయుళ్ల దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇనయా హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది. మరి చూడాలి నెక్స్ట్ వారం ఎవరు నామినేట్ అవుతారో.. ఎవరు ఎలిమినేట్ అవుతారో..?

Share post:

Latest