జ‌న‌సేన వైపు.. ఆ వైసీపీ ఎమ్మెల్యేల చూపు.. ఇంత షాకా…!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో మార్పులు జ‌రుగుతున్నాయ నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. చాలా మంది జ‌గ‌న్ అభిమానుల‌మ‌ని చెప్పుకొనే నాయ‌కులు కూడా ఇప్పు డు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే త‌మ దారి తాము చూసుకునేందుకు ప్ర‌య‌త్నా లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏం జ‌రిగిందో ఏమో.. ఇక్క‌డ మాత్రం ప్ర‌కంప‌న‌లు పుట్టాయి. ఇటీవ‌ల జ‌రిగిన‌.. ప్లీన‌రీలో ఒక ఎమ్మెల్యే.. జ‌గ‌న్‌పైనే నేరుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. “సీఎం జ‌గ‌న్‌కే అన్ని విష‌యాల్లోనూ క్రెడిట్ వ‌స్తోంది. ఎమ్మెల్యేలుగా మేం స‌మాధా నం చెప్ప‌లేక పోతున్నాం“ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు అన్ని మీడియా చానెళ్ల‌లోనూహైలెట్ అయ్యాయి. అలానే మంత్రి ప‌ద‌వి కోసం..సామాజిక వ‌ర్గాల వారీగా ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యారు.

అంతేకాదు.. ఈ ఎమ్మెల్యే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కూడా చెప్పారు. త‌న వ‌ర్గం వారితో ధ‌ర్నాలు.. నిర‌స‌న‌లు కూడా చేయించారు. అయితే.. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు.. గెలిచిన సీట్ల‌లో గ‌తంలో రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి గెలిచిన సీట్లు అయినా.. కూడా జ‌గ‌న్ సామాజిక న్యాయం చేయాల‌ని.. గ‌తంలో ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు వైఎస్ ఆర్ ఫొటోల‌ను త‌గ‌ల బెట్టారు. అయినా కూడా.. వీరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి.. గెలిపిస్తే.. వారిద్ద‌రు ఇప్పుడు ప‌వ‌న్‌ను క‌లుసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇలా వైసీపీని దెబ్బ‌తీసి.. త‌న సొంత వర్గానికి ప‌ట్టం క‌ట్టి వాళ్ల‌ను అన్ని విధాలుగా బాగు ప‌రిచి.. ఆ త‌ర్వాత‌.. జ‌న‌సేన‌కు జంప్ అవ్వాల‌ని.. చూస్తున్నార‌ని పెద్ద ఎత్తున వైసీపీ కేడ‌ర్‌లో గుస‌గుస వినిపిస్తోంది. అందులో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు.. పార్టీ కోసం.. ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌లేదని, ఎన్నిక‌ల‌కు ముందు.. చివ‌రి నిముషంలో పార్టీలో చేరి టికెట్లు సంపాయించుకున్నార‌ని నాయ‌కులు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇచ్చిన డ‌బ్బులు కూడా ప్ర‌జ‌ల‌కు పంచ‌కుండా.. వ్య‌వ‌హ‌రించారని చెబుతున్నారు.

Share post:

Latest