వైసీపీ ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్‌… మామూలు లాభం కాదుగా…!

వైసీపీ ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్‌.. వేసింది. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌చారం రావ‌డం లేదని.. అంతా నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని.. త‌ర‌చుగా.. సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అనుకూల మీడియా లేద‌ని.. తాము ఏం చేస్తున్నా.. వ్య‌తిరేక కోణంలోనే చూస్తున్నార‌ని.. ఆయ‌న ర‌గిలిపోతున్నారు. అంతేకాదు.. త‌ర‌చుగా.. కొన్ని ప‌త్రిక‌లు మీడియాల‌పై.. ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు. తాము ప్ర‌జ‌ల కు ఎంతో మేలు చేస్తున్నాని కూడా ఆయ‌న చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వాయిస్ నిరంత‌రం ప్ర‌జ‌ల‌కు వినిపించేలా .. సీఎం జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ అమ‌లు చేస్తున్నారు. దీనికి ఏపీ ఫైబ‌ర్ నెట్‌ను ఆయ‌న వినియోగించుకోవాల‌ని చూస్తున్నారు. దీని ద్వారా.. `ఏపీ టీవీ` అని స‌రికొత్త ఛాన‌ల్‌ను ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు అధికారి కంగానే ప్ర‌క‌టించాయి. త‌ద్వారా.. నిరంత‌రం ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని.. ఈ ఛానెల్ వివ‌రిం చ‌నుంది.

అంటే.. ఇది ఒక‌ర‌కంగా.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌చారం, ప్ర‌సారం చేయ‌నుంది. సీఎం ఎక్క‌డికి వెళ్తే.. అక్క‌డి ఫాలో ఫాలో ఫాలో మీ.. అన్న‌ట్టుగా ఈ మీడియా ఆయ‌న‌ను అనుస‌రించ‌నుంది. ఆయ‌న చెప్పే వ్యాఖ్య‌ల‌కు విశ్లేష‌ణ‌లు అందించ‌నుంది. అదేవిధంగా.. పార్టీ నాయ‌కుల విశ్లేష‌ణలు.. కూడా ప్ర‌చారం చేయ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఈ ప్ర‌చారం జోరుగా సాగించేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ..దూర‌ద‌ర్శ‌న్ చానెల్‌నువినియోగించుకుంటున్న‌ట్టుగా.. సీఎం జ‌గ‌న్ కూడా ఈ ఏపీ టీవీని వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఎంత వ‌ర‌కు ఇది స‌క్సెస్ అవుతుంది? అనేది చూడాలి.

Share post:

Latest