జ‌గ‌న్‌కు యాంటీగా అనుకూల మీడియా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయనే సంగతి తెలిసిందే..ఎవరికి వారికి మీడియా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉన్న అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి సెపరేట్ గా అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటి పని ఒకటే..ఎవరికి వారికి భజన చేయడం..ప్రత్యర్ధులని నెగిటివ్ చేయడం..ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా పని వచ్చి…చంద్రబాబుని పైకి లేపడం…జగన్ ని నెగిటివ్ చేయడం..ఇక వైసీపీ అనుకూల మీడియా వచ్చి..జగన్ ని పైకి లేపడం…బాబుపై విమర్శలు చేయడం.

ఎంత కాదు అనుకున్న…ఇదే వాస్తవం…కొన్ని మీడియా సంస్థలు..ఇలా పార్టీలకు అనుబంధ సంస్థలుగా మారిపోయాయి. అయితే ఈ మధ్య కాస్త వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు మారుతున్నాయి…మరి జగన్ ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపాలని అనుకుంటున్నారా? లేక జగన్ ని అలెర్ట్ చేయాలని చేస్తున్నారా? అనేది క్లారిటీ లేదు గాని..కొన్ని తప్పులని ఏ మాత్రం మొహమాటం లేకుండా వైసీపీ అనుకూల మీడియా ఎత్తిచూపుతుంది.

ముఖ్యంగా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని పూర్తిగా తప్పుబడుతుంది. ఆయనకు వైసీపీ అనుకూల మీడియా ఏ మాత్రం మద్ధతు ఇవ్వడం లేదు. అలాగే ఆయనపై సస్పెన్షన్ వేటు త్వరగా వేయాలనే విధంగా కథనాలు ఇస్తుంది. అదే సమయంలో తాజాగా జగన్…కుప్పం కార్యకర్తలతో భేటీ అయ్యి…అక్కడ భరత్ ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇచ్చిన హామీపై విమర్శలు చేస్తుంది.

ఇప్పటికే 2019 ఎన్నికల సమయంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ లకు మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు…కానీ ఇంతవరకు నెరవేర్చలేదని, ఇంకా నెరవేర్చే ఛాన్స్ కూడా లేదని, అలాంటప్పుడు భరత్ కు మంత్రి పదవి హామీ ఇస్తే కుప్పం ప్రజలు నమ్ముతారా? అని అనుకూల మీడియా జగన్ ని ప్రశ్నిస్తుంది. అలాగే నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో సమావేశామని చెప్పి…వారిని నియోజకవర్గంలో పరిస్తితులు గురించి అడగకుండా…వన్ సైడ్ గా జగనే మాట్లాడటం కరెక్ట్ కాదని అంటుంది. మొత్తానికి వైసీపీ అనుకూల మీడియా తప్పులని సరిచేసే కార్యక్రమం చేస్తున్నట్లు ఉంది.