హిట్ కోసం ఓ మెట్టు దిగిన నితిన్.. సంచలన నిర్ణయం..!?

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా నితిన్ స్థానమే వేరు. జయం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన నితిన్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ,, తెలుగు చలనచిత్ర పరిశ్రమలు తనకంటూ ఓ సపరేట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుసగా హిట్లు తన ఖాతాలో వేసుకున్న నితిన్..ఇప్పుడు ఒక్క హిట్టు కోసం నానా తంటాలు పదుతున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ ఇప్పుడు చాలా స్లోగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే తన కెరీర్ చాలా డౌన్ అయింది .

Macherla Niyojakavargam Movie (Aug 2022) - Trailer, Star Cast, Release Date | Paytm.com

దానికి కారణాలు ఆయన చూస్ చేసుకునే సినిమాలె. కథలో పెద్దగా కంటెంట్ లేకపోవడం. చేసిన సినిమా కథనే మళ్లీమళ్లీ చేస్తుండడంతో.. ఆయనను జనాలు చూడడానికిఇష్ట పడటం లేదు. రీసెంట్ గా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానులు సైతం ఈ సినిమాను చూసి ఫస్ట్ హాఫ్ లోనే థియేటర్స్ నుంచి లేచి వచ్చేసే పరిస్థితి ఎదురైంది. అంత బోర్ కొట్టించింది
ఈ సినిమా.

Here Comes The First Charge Of Nithiin's 'Macherla Niyojakavargam' Movie

గత కొంతకాలంగా హిట్ లేకుండా బాధపడుతున్న నితిన్ కు ఈ సినిమా హిట్ ఇస్తుందని ఆశపడ్డాడు. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టడానికి నితిన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు మల్టీ స్టార్ సినిమాలు అంటే భయపడ్డా నితిన్.. ఇప్పుడు ఆ సినిమాలు చేసేందుకే ఓ మెట్టు దిగినట్టు తెలుస్తుంది. ఆయన కంటే తక్కువ స్థాయి హీరో అయిన మరో యంగ్ హీరోతో నితిన్ కలిసి ఓ మల్టీ స్టార్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇదివరకే ఈ హీరోతో సినిమా చేయమంటే వెనకడుగు వేసిన ఈ హీరో.. ఇప్పుడు అదే హీరోతో సినిమా చేయడానికి ఓ మెట్టు దిగ్గాడు అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో నితిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఒకప్పుడు తానే వద్దన్న హీరోతో ఇప్పుడు తానే సినిమా చేస్తాననడం ఎంతవరకు కరెక్ట్ అంటూఅభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం నితిన్ చెప్తారంటారా..?

 

Share post:

Latest