కృష్ణాలో వైసీపీకి బిగ్ షాక్‌… ప‌ద‌వికి రాజీనామా చేసిన కీల‌క‌నేత‌..

కృష్ణా జిల్లాలో అధికార వైసిపికి భారీ షాక్ తగిలింది. ఉయ్యూరు జడ్పీటీసీ య‌ల‌మంచిలి పూర్ణిమ తన పదవికిి రాజీనామా చేశారు. త‌న‌ రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. వైసిపి అంటేనే గ్రూప్ రాజకీయాలు అధికంగా ఉండే పార్టీ. అసలే కృష్ణా జిల్లా… ఉయ్యూరు పెన‌మలూరు నియోజకవర్గంలోకి వస్తుంది. వైసీపీ మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇక్క‌డ‌ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రధానంగా పార్టీలో ఉన్న పెద్దల నియంతృత్వ ధోరణి నచ్చక పూర్ణిమ‌ జడ్పిటిసి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. మరి పార్టీ పెద్దలంటే పార్థసారథి పై పూర్ణిమ అసంతృప్తి వ్య‌క్తం చేసిందా ? లేదా ఇంకేమైనా కారణాలు వల్ల రాజీనామా చేసిందా అనేది తెలియాల్సి ఉంది.

Share post:

Latest