పూరి గత పాపాలకు విజయ్ బలి… టైం చూసి కొట్టిన మెగా ఫ్యాన్స్..!?

రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను పాన్‌ ఇండియా లెవెల్‌కు తీసుకు వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత వ‌రుస పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర‌లో ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య వాతావ‌ర‌ణం స‌రిగా లేదు. గ‌తంలో విజయ్ దేవరకొండ, పూరి జ‌గ‌న్నాథ్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు చిరంజీవి, మెగా ఫ్యాన్స్‌ను బాగా హ‌ర్ట్ చేశాయి.

ఇక ఇప్పుడు వాళ్లంతా లైగ‌ర్‌ను టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. లైగ‌ర్ సినిమాకు ఓవర్సీస్‌లో సహా తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ రాలేదు. ఎక్కువ మంది ఈ ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. దీంతో భారీ అంచ‌నాల‌తో సినిమాకు వ‌చ్చిన విజ‌య్ ఫ్యాన్స్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. పూరి జగన్నాథ్ ని వారి నోటకి వచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు.

గ్రాండ్‌గా రిలీజ్... థియేటర్లలో రచ్చ

పూరీ జగన్నాథ్‌ సినిమాలు మానేసి ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమాపై మెగా అభిమానులు కూడా స్పందిస్తూ. మెగా ఫాన్స్ కూడా ట్వీట్ చేస్తున్నారు. చిరంజీవి నువ్వు మాత్రం పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తే మామూలుగా ఉండదంటూ చిరంజీవికి వార్నింగ్ ఇచ్చే విధంగా ట్విట్టర్ వేదిక పోస్టులు పెడుతూ పూరిని ఆడేసుకుంటున్నారు.

vijay deverkonda ananya pandey new film ligar first song aafat released on  youtube see romantic video mkph | फिल्म Ligar का नया गना रिलीज, समुद्र  किनारे रोमांस करते दिखे विजय देवेराकोंडा ...

ఇదే క్రమంలో కొందరు మెగా అభిమానులు ఆసక్తికరమైన చర్చకు దారి లేపారు. చిరంజీవి కం బ్యాక్ మూవీ పూరి జగన్నాథ్ తో చేస్తారని అప్పట్లో ఒక వార్త బయటకు వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చిరంజీవి వివి.నాయక్ తో చేశాడు. ఆ త‌ర్వాత పూరి చిరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఇప్పుడు పూరి ఇచ్చిన డిజాస్ట‌ర్ దెబ్బ‌తో మెగా ఫ్యాన్స్ పూరిని కౌంట‌ర్ చేస్తూ ఆడేసుకుంటున్నారు.

Chiranjeevi's cheeky reply to director Puri Jagannadh on Twitter wins  hearts | Regional-cinema News – India TV

Share post:

Latest