గద్దె వర్సెస్ దేవినేని..వంగవీటి కీ రోల్?

ఏపీలో రాజకీయాల్లో పలు సర్వేలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే..ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీనే లీడింగ్ లో ఉంది అని, అదే సమయంలో టీడీపీ పుంజుకుంటుందని పలు సర్వేల్లో తేలింది. ఏదేమైనా గాని ఎన్నికల నాటికి టీడీపీ ఇంకా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

అలా రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే స్థానాల్లో విజయవాడ ఈస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మామూలుగా విజయవాడ ఈస్ట్‌లో టీడీపీకి అనుకూల పరిస్తితులు ఉన్నాయి….ఎందుకంటే ఇక్కడ వివాదరహిత నాయకుడు గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాంటి వివాదాలు జోలికి వెళ్లకుండా రాజకీయం చేసే గద్దెకు ప్రజల మద్ధతు ఎక్కువ…అధికారంలో ఉన్న, లేకపోయినా గద్దె ప్రజల కోసం పనిచేస్తారు. అందుకే ఆయనకు ఈస్ట్‌లో బలం ఎక్కువ..పైగా వరుసగా రెండు సార్లు గెలిచారు.

అయితే వైసీపీ తరుపున దేవినేని అవినాష్ బరిలో లేకుండా ఉంటే…ఈస్ట్ లో మళ్ళీ గద్దెకు విజయం సులువుగా వచ్చింది. ఎప్పుడైతే దేవినేని ఈస్ట్ పగ్గాలు తీసుకున్నారో అప్పటినుంచి…అక్కడ వైసీపీ బలం పెరుగుతూ వస్తుంది. పైగా అధికారంలో ఉండటంతో…ఒక ఎమ్మెల్యే మాదిరిగా నియోజకవర్గంలో పనులు చేసి పెడుతున్నారు…అవసరమైతే సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి ప్రజలకు అండగా ఉంటున్నారు. దీంతో దేవినేని బలం కూడా పెరిగింది.

నెక్స్ట్ ఎన్నికల్లో గద్దె, దేవినేనిల మధ్య టఫ్ ఫైట్ జరగడం ఖాయం…అలాగే ఎవరు గెలుస్తారో ముందే అంచనా వేయలేని పరిస్తితి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఈస్ట్‌లో వంగవీటి రాధా కీ రోల్ పోషిస్తారని చెప్పొచ్చు. ఈస్ట్‌లో వంగవీటి అభిమానులు ఎక్కువ…వారు దేవినేని వైపు అసలు వెళ్లరు..పైగా రాధా టీడీపీ వైపే ఉన్నారు కాబట్టి గద్దెకు మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది…అదే సమయంలో టీడీపీతో జనసేన పొత్తు ఉంటే గద్దెకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే రాధా, జనసేన ఎఫెక్ట్‌తో గద్దెకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మరి నెక్స్ట్ ఈస్ట్ రాజకీయం ఎలా మారుతుందో.