భాయ్‌ఫ్రెండ్‌తో ఇబ్బందులా… ఆత్మ‌హ‌త్య విష‌యాన్ని బ‌య‌ట పెట్టిన దీపిక‌..!

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌ముఖ బ్యాడ్మింన్ స్టార్ ప్ర‌కాష్ ప‌దుకొనే కుమార్తె అయిన దీపిక బాలీవుడ్‌ను ప‌దేళ్ల పాటు ఊపేసింది. ప్ర‌స్తుతం ఆమె ర‌ణ‌వీర్‌సింగ్‌ను పెళ్లాడి త‌న ఫ్యామిలీ లైఫ్‌ను ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె త‌న జీవితంలో గ‌తంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌ట పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది.

ఇటీవల మానసిక ఆరోగ్యం గురించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తన డిప్రెషన్‌ రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ నటిగా నా కెరీర్‌ చాలా బాగుండేది. కానీ నాకెందుకో బాధగా ఉండేది.. అయితే ఆ బాధకు కారణం తెలిసేది కాద‌ని దీంతో.. ఒక్కోసారి ఏడుపొచ్చేది.. నిద్ర కూడా ప‌ట్టేదే కాదు… ఆ బాధ నుంచి త‌ప్పించుకునేందుకు ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు కూడా నా మ‌న‌స్సులో వ‌చ్చాయ‌ని ఆవేద‌న‌తో చెప్పింది.

మా అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు.. అప్పుడప్పుడు వాళ్ళు ముంబైలో ఉన్న త‌న వ‌ద్ద‌కు వ‌చ్చేవారు.వారు వచ్చినప్పుడల్లా వారి ముందు ఉత్సాహంగా ఉన్నా.. ఓ సారి మాత్రం అమ్మ దగ్గ‌ర త‌న బాధ చెప్పుకున్నాన‌ని దీపిక తెలిపింది. అప్పుడు అమ్మ కెరీర్ స‌మ‌స్య‌లా ? భాయ్‌ఫ్రెండ్‌తో ఇబ్బంది ఉందా ? అని అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియలేదు… ఎందుకంటే అవేవీ నా బాధకు కారణాలు కాద‌ని దీపిక చెప్పింది.

ఆ త‌ర్వాత మా అమ్మ అర్థం చేసుకుని, నేను డిప్రెషన్‌ నుంచి బయటపడేలా చేసింద‌ని.. అప్పుడు ఆ దేవుడే త‌న వ‌ద్ద‌కు అమ్మ‌ను పంపాడ‌ని ఆమె చెప్పింది.

Share post:

Latest