రామ్ చరణ్‌ గొప్పతనం బయటపెట్టిన ట్రైనర్… చరణ్‌ ఆ విషయం దాచాడట?

రామ్ చరణ్ గురించి తెలియని తెలుగువాడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆమడ దూరం వుండే చరణ్ అంటే అభిమానులకు పిచ్చి. రామ్ చరణ్ ఎంత ఒద్దికగా ఉంటాడో సందర్భాన్ని బట్టి సినిమావాళ్లు, సన్నిహితులు, స్నేహితులు ఎక్కడో ఒకచోట ప్రస్తావిస్తూనే వుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ విషయాన్ని రామ్ చరణ్ ట్రైనర్ అయినటువంటి ‘కుల్దీప్ సేతి’ చెప్పుకొచ్చాడు.

అతను ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ…. తన ఫస్ట్ సెలెబ్రిటీ రామ్ చరణ్ అని, ఆయనకు మొదటి సారిగా ట్రైనింగ్ ఇచ్చానని కుల్దీప్ గర్వంగా చెప్పుకొచ్చాడు. చరణ్ మొదటి సినిమా చిరుత సమయంలోనే రామ్ చరణ్‌కు తాను ట్రైనింగ్ ఇచ్చానని, అయితే వచ్చిన మొదట్లో అతను మన బాస్ చిరంజీవి కొడుకు అని తెలీదట. ఎవరో ఫ్రెండ్ చెబితేనే అతనికి తెలిసిందట. అతను ఎవరో నీకు తెలుసా? చిరంజీవి కొడుకు అని చెప్పడంతో షాక్ ఒక్కసారిగా షాక్ అయ్యాను అంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

దాంతో అతగాడు “ఏంటి భయ్యా! మీరు మా బాస్ చిరంజీవి కొడుకు అని చెప్పలేదు!” అని రామ్ చరణ్‌ని అడగగా… “అది చెప్పాల్సిన అవసరం ఏముంది?” అంటూ చాలా హంబుల్ గా నవ్వేశాడట రామ్ చరణ్. అంత హంబుల్‌గా వుంటాడు కాబట్టే ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో ఈ స్థాయిలో వున్నాడని చెప్పుకొచ్చాడు. అలాగే ఇతను మధ్యలో చిరంజీవికి కూడా ట్రైనింగ్ ఇచ్చాడట. ఓ రెండేళ్లు చిరంజీవిని ట్రైన్ చేయడం, చేసే అదృష్టం దొరికిందంటూ కుల్దీప్ ఈ సందర్భంగా ఎమోషనల్ అవ్వడం మెగాభిమానులను ఆనందంలో ముంచి వేసింది.

Share post:

Latest