గన్నికి లక్కీ ఛాన్స్…ప్లస్ అయినట్లే!

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు నిదానంగా పుంజుకుంటున్నారు…గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నేతలు…ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు…ఓడిపోయిన దగ్గర నుంచి చాలామంది నేతలు ప్రజల్లో ఉంటూ…వారి మద్ధతు పెంచుకుంటూ వస్తున్నారు…అదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత టీడీపీ నేతలకు బాగా ప్లస్ అవుతుంది.

అలా టీడీపీ పుంజుకోవడమే కాకుండా…వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు బాగా కలిసొచ్చేలా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి అనుకూలంగా ఉండే స్థానాల్లో ఉంగుటూరు కూడా ఒకటి…2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరుపున గన్ని పోటీ చేసి….వైసీపీ నుంచి పోటీకి దిగిన పుప్పాల శ్రీనివాసరావుని ఓడించారు. 2019 ఎన్నికల్లో సీన్ మారిపోయింది…టీడీపీపై వ్యతిరేకత పెరగడం…జగన్ ఒక్క ఛాన్స్ అని ప్రజలు అడగటం..దీంతో వైసీపీకి అనుకూలంగా ప్రజలు నిలబడ్డారు.

ఈ క్రమంలోనే ఉంగుటూరులో పుప్పాల వాసుబాబు చేతిలో గన్ని దాదాపు 33 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అయితే టీడీపీ అధికారం కోల్పోవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలు చాలామంది సైలెంట్ అయ్యారు…కానీ గన్ని మాత్రం సైలెంట్ అవ్వకుండా..ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారు…ఓ వైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే…మరోవైపు ఉంగుటూరులో బలం పెంచుకునే కార్యక్రమాలు చేస్తూ వచ్చారు.

అలాగే ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేయడం వల్ల..ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా టీడీపీ బలం పెరుగుతూ వచ్చింది. అయితే సొంత స్థానంపై ఎక్కువ ఫోకస్ చేసి…గన్ని తన బలాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని సర్వేల్లో తేలింది…ఇటీవల వచ్చిన పీకే టీం సర్వేలో కూడా ఉంగుటూరులో వైసీపీ పరిస్తితి పెద్దగా బాగోలేదని తేలింది. ఇక్కడ ఎమ్మెల్యేకు ప్రతికూల నివేదిక వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ పరిణామాలు గన్నికి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల వరకు ఇంకా కష్టపడి పనిచేస్తే…ఉంగుటూరులో గన్ని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

Share post:

Latest