‘స్టూడెంట్ నెం 1’ కోసం ప్రభాస్‌ను మోసం చేసిన తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నేడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు ఇండియాలోని లీడింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అటు వ్యక్తిత్వంలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోగలిగారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నిజానికి వీరి తాత నందమూరి తారక రామారావు ముఖానికి మేకప్ వేసి దగ్గరుండి బాల నటుడిగా ఎన్టీఆర్ ను వెండితెరకు పరిచయం చేశారు . ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ వెనతిరిగి చూడలేదని చెప్పాలి.Jr NTR, Prabhas To Come Together For This Movie!ఇక ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఒక తండ్రిగా హరికృష్ణ కూడా ఎంతో కృషి చేశారు అని, ప్రముఖ దిగ్గజ నిర్మాత అశ్విని దత్ తన మాటల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఆలీతో సరదాగా షో కి హాజరైన అశ్వినీ దత్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సంగతులను పంచుకోగా ప్రేక్షకులకు పలు ఆసక్తికరమైన విషయాలు కూడా తెలియడం జరిగింది. అయితే ఈ సినిమా కథ ముందు ఎన్టీఆర్ తో కాకుండా ప్రభాస్ కోసం రాసిన కథ . అయితే ఆ తర్వాత హరికృష్ణ ఎంట్రీ ఇచ్చి కథను మార్చేశారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కోసం హీరోగా ఎవరిని పెట్టాలా అని వెతుకుతున్న సమయంలో మొదట ప్రభాస్ ని అనుకోవడం .. అయితే ఆ సమయంలో హరికృష్ణ స్వయంగా అశ్విని దత్ కు ఫోన్ చేసి ఆ సినిమాలో తారక్ హీరోగా పెట్టాలని కోరారుట.19 years for Student No 1

చేసేదేమీ లేక అశ్వినీ దత్ జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి సినిమా తీశారు. ఇక ఈ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో.. ఎన్టీఆర్ కి ఎంత పేరు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. తన కెరియర్ మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతోనే మొదలయింది. ఇక ఆరోజు హరికృష్ణ అలా చక్రం తిప్పబట్టే అలాంటి కథ ఎన్టీఆర్ కు లభించడం.. నేడు దేశం గర్వించదగ్గ నటుడుగా గుర్తింపు తెచ్చుకోవడం అన్నీ జరిగిపోయాయి. కానీ కొడుకు సక్సెస్ చూడడానికి హరికృష్ణ లేకపోవడం మాత్రం నిజంగా చాలా బాధాకరమైన ఘట్టం అని చెప్పాలి.

Share post:

Latest