ఇంద్రగంటితో అఫైర్ ఉందన్న సుధీర్ బాబు… అయోమయంలో ఫాన్స్!

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. అలాగే హీరో సుధీర్ బాబుకి, ఇంద్రగంటి వున్న బంధం గురించి కూడా తెలిసినదే. ఇకపోతే హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టిల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కొత్త నిర్మాతలు మహేంద్ర, కిరణ్, సుధీర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిత్రీకరించిన ఓ వెరైటీ పాటను ఈ రోజు ఎ ఎబ్ బి థియేటర్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒకే దర్శకుడితో నే దాదాపు 3 సినిమాలు చేసానని, అందువల్ల ఇంద్రగంటికి తనకు అఫైర్ వుందని సరదాగా మీరు రాసేసుకోవచ్చు అని మీడియావారిని ఉద్దేసించి చమత్కరించారు. ఇంద్రగంటి కథకు న్యాయం చేసే దర్శకుడు . ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని అన్నారు. అలాగే కృతి ఆ సినిమాలో అద్భుతమైన పాత్ర చేసిందని, ఉప్పెన వల్ల ఆమెకు పది సినిమాలు వస్తే ఈ సినిమాతో కృతి టాలీవుడ్ లో స్థిరపడిపోతుంది అని అన్నారు.

అంతబాగుంది కానీ ఆ ఎఫైర్ అన్న మాటలే ఇపుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. ముఖ్యంగా దీనికి సుధీర్ బాబు అభిమానులు మాత్రం ఒకింత అయోమయోల్లో పడినట్టు భోగట్టా. అదంతా ఒకెత్తయితే, సుధీర్ మాట్లాడుతూ మహేష్ బాబు సినిమా ఎంత రిచ్ గా వుంటుందో ఈ సినిమాలో కూడా అంతే రిచ్ నెస్ వుంటుంది అని అనడంతో ఒక్కసారిగా మహేష్ అభిమానులు చివుక్కుమన్నారు. ఇంకా మాట్లాడుతూ సదరు పాటను జర్నలిస్ట్ BA రాజుకు, జర్నలిస్ట్ లకు డెడికేట్ చేస్తున్నానని అన్నారు.

Share post:

Latest