సారీ..ఆ నమ్మకం పోయింది..ప్రభాస్ సినిమాకు భారీ షాకిచ్చిన పెద్దాయన..!?

పాన్ ఇండియా సినిమాలో నటించే ప్రభాస్ టాలీవుడ్ కామెడీ డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేస్తున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం అన్ని పనులు పూర్తి చేసినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ షాకింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ మారుతి సినిమా నుండి స్టార్ట్ ప్రొడ్యూసర్ DVV దానయ్య తప్పకున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కు బ్రేకులు పడట్లు ఓ వార్త వైరల్ గా మారింది. దీనికి కారణం లేకపోను లేదు.. రీసెంట్ గా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా చూశాక నిర్మాత DVV దానయ్య , మారుతీ పై పెట్టుకున్న నమ్మకాని కోల్పోయాడట. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని అనుకున్నారట.

RRR Producer lines up 5 Mega Projectsకానీ ప్రభాస్ ఫోర్స్ చేయడం వల్లే ఇన్నాళ్లు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తానని మాట ఇచ్చి.. లాస్ట్ మినిట్ లో ప్రభాస్ కు సారీ చెప్పి ఈ సినిమా నుంచి తప్పకున్నట్లు సినీవర్గాలు అంటున్నాయి. అయితే DVV దానయ్య లాంటి పెద్ద నిర్మాతనే ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి వేరే ఏ నిర్మాతలు ముందుకు రావడం లేదట. దీంతో ప్రభాస్ మారుతి సినిమా ఆగిపోయినట్లే అంటున్నారు సినీ వర్గాలు. మరి చూడాలి ఇన్ని ఇబ్బందుల మధ్య మారుతి కెరియర్ ఎలా ఉంటుందో..?

DVV Danayya is out of Prabhas & Maruthi Project?