వైసీపీకి `సెప్టెంబ‌రు 1` గండం.. జ‌గ‌న్ ఏం చేస్తాడో…!

ఏపీ అధికార పార్టీకి ఒకటి త‌ర్వాత‌.. ఒక‌టిగా.. స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఒక‌స‌మ‌స్య‌నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలోపే.. మ‌రో స‌మ‌స్య వెంటాడుతున్న ప‌రిస్థితి.. పార్టీని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సీపీఎస్ ర‌ద్దు కోరుతూ.. ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. సెప్టెంబ‌రు 1 రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న ఉద్యోగులు.. ఉద్య‌మించేందుకురెడీ అయ్యారు. విజ‌య‌వాడ‌లో ప‌ది ల‌క్ష‌ల మందితో మిలీనియ‌మ్ మార్చ్‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

అదేస‌మ‌యంలో సీఎం ఇంటి ముట్ట‌డికి కూడా పిలుపునిచ్చారు. ఈ ప‌రిణామాలు.. ఏడాదిలో జ‌రుగుతు న్న రెండోప‌రిణామం కావ‌డంతో వైసీపీ స‌ర్కారు ఉలిక్కిప‌డుతోంద‌ని మేధావులు అంటున్నారు. సీపీఎస్ ను ర‌ద్దు చేయ‌లేమ‌ని.. మంత్రులు చెబుతున్నారు. కానీ, ర‌ద్దు చేయాల్సిందేన‌ని.. ఉద్యోగులు ప‌ట్టుబ‌డు తున్నారు. గ‌తంలో పీఆర్సీ కోసం.. ఉద్య‌మించిన‌ప్పుడు.. దానిని లైట్ తీసుకున్నారు. దీంతో విజ‌య‌వా డ‌కు ఎక్క‌డెక్క‌డ నుంచో ఉద్యోగులు వ‌చ్చి.. ఆందోళ‌న చేశారు.

ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో విరుచుకుప‌డే ప్ర‌మాదం ఉంద‌ని.. ప్ర‌భుత్వం యోచిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల‌పై నిర్బంధాలు కొన‌సాగుతున్నాయ‌ని.. సంఘాలు ఆరోపిస్తున్నాయి. వారి వాహ‌నాల ను కూడా స్వాధీనం చేసుకున్నార‌ని చెబుతున్నారు. అయితే.. దీనికి విరుగుడు లేదా? అనేది స‌ర్కారు ఇప్పుడు దృష్టి పెట్టిన విష‌యం. రాబోయే నాలుగు రోజుల్లో ఏమైనా.. సంచ‌ల‌నాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా చెబుతున్నారు.

అంటే.. న‌యానో.. భ‌యానో.. ఉద్యోగుల‌ను త‌న‌వైపు తిప్పుకొని.. వారిలో చీలిక తెచ్చి.. రెండు మూడు వ‌ర్గాల‌ను త‌నకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాలు తీవ్ర‌మ‌య్యే యోచ‌న ఉంద‌ని.. దీనిని క‌ట్టడి చేస్తామ‌ని.. అంటున్నారు. మ‌రోవైపు.. కొంద‌రు స‌ల‌హాదారులు.. అంత‌ర్గ‌తంగా ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి. ఏదేమైనా.. సెప్టెంబ‌రు 1 మాత్రం స‌ర్కారులో గుబులు రేపుతోంది.

Share post:

Latest