బాలీవుడ్ లో ఒణుకు పుట్టిస్తున్న టాలీవుడ్..

టాలీవుడ్ సినిమా లు విడుదలవుతున్నాయి అంటే బాలీవుడ్ హీరోలు,డైరెక్టర్ లు భయపడుతున్నారా?? ప్రతి సీజన్ లో టాలీవుడ్ చేతిలో బాలీవుడ్ ఓడిపోతోందా??ఇపుడున్న పరిస్థితిలో అవుననే సమాధానమే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడుదలయిన బాహుబలి, RRR, పుష్ప దగ్గరనుండి ఇటీవల విడుదలయిన నిఖిల్ సిద్ధార్థ్ సినిమా కార్తికేయ 2 వరకు అన్ని బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి .

ఆగస్ట్ 13న విడుదలైన కార్తికేయ2 ,విధులయిన అన్ని భాషల్లో ధూసుకేళ్తోంది..ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ లని ధాటేసింది. ఇదే విషయం గురించి దర్శకుడు ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇపుడు బాలీవుడ్ హీరోలను కలవరపెడుతోంది.

కార్తికేయ2 సినిమా అక్షయ్ & అమీర్ సినిమాల కలెక్షన్స్ ధాటేసింది అని, ఈ సినిమా కేజీఎఫ్2 & ఆర్ఆర్ఆర్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అని అయన ట్వీట్ చేసారు..మరి ఇది బాలీవుడ్ హీరోలని రెచ్చగొట్టే ప్రయత్నమా లేదంటే ఇప్పటికైనా మేలుకొమ్మని బాలీవుడ్ డైరెక్టర్స్ కి సలహా నా!?