విరాట్ కోహ్లీ డిప్రెష‌న్‌కి కారణం భార్య అనుష్క శర్మనా?

విరాట్ కోహ్లీ.. అంటే ఎవరో తెలియని క్రికెట్ క్రీడాభిమానులు ఉండరనే చెప్పుకోవాలి. ఒక‌ప్పుడు అత‌ను క్రికెట్ మైదానంలో ఉంటే శత్రువుకి అలజడి రేగేది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి పూర్తి భిన్నంగా మారింది. రోజురోజుకి కోహ్లీ గ్రాఫ్ పడిపోతుంది. ఒకప్పుడు సెంచరీలు మీద సెంచరీలు చేసిన మొనగాడు ఇపుడు కనీసం 50 ప‌రుగులు కూడా చేయ‌డానికి తటపటాయిస్తున్నాడు. కోహ్లీ సెంచరీ కోసం అతడి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అవును… చాన్నాళ్లుగా సాధికారతతో ఆడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోహ్లీ… పాకిస్తాన్ తో జ‌రిగిన పోరులో బంతిని బాగానే టైమింగ్ చేశాడు.

ఆరంభంలో కొన్ని బంతులకు తడబడినప్పటికీ, క్రీజులో కుదురుకున్న తర్వాత తనదైన శైలిలో షాట్లు ఆడి ఆడియన్స్ మెప్పు పొందాడు. అలా మొత్తమ్మీద 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. కోహ్లీ స్కోరులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఈ క్రమంలో స్పిన్నర్ నవాజ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో అభిమానులు మరలా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. మ‌ళ్లీ అత‌ని మంచి ఇన్నింగ్స్ కోసం క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకొని ఎదురు చూడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేయడం పెనుదుమారాన్నే సృష్టిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లపై విమర్శలు చేసిన కమల్ రషీద్ ఖాన్ ఇప్పుడు తాజాగా విరాట్ కోహ్లీపై సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకున్నాడు. విరాట్ కోహ్లీ డిప్రెషన్‌లో వెళ్లాడని, అందుకే బాగా ఆడటంలేదని, అయితే దానికి కారణం బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే అని ఆరోపించాడు. ఆమె వల్లే కోహ్లీ డిప్రెషన్‌కు గురవుతున్నాడని పేర్కొన్నాడు. అక్కడితో ఆగకుండా ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటే.. పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నాడు.

Share post:

Latest