పాన్ ఇండియా హీరోని బుట్టలో పడేయాలనుకుంటున్న రకుల్ ప్రీత్?

రకుల్ ప్రీత్… గురించి చెప్పాల్సిన పనిలేదు. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాని ఒక ఏలు ఏలిన అమ్మడు ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించింది. దానికి కారణాలు అందరికీ తెలుసు. ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందే. మరీ ముఖ్యంగా ఇది హీరోయిన్ల విషయంలో పక్కా. ఆ విషయాన్ని అమ్మడు తొందరగానే గ్రహించింది. దాంతో అమ్మడు బాలీవుడ్ మీద పాగా వేసింది. అక్కడికి వెళ్లి వెళ్లడంతోనే ఓ అర డజనుకు పైగా హిందీ సినిమాల అవకాశం చేజిక్కించుకుంది.

దాంతో రకుల్ అక్కడ సినిమాలు చకచకా చేసేస్తోంది. ఇందులో బడా హీరోలు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం వంటి హీరోల సరసన కూడా ఆమె నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. ఇప్పుడు రకుల్ తిరిగి రకుల్ తెలుగు సినీరంగం వైపు చూస్తోందట. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు సినిమాలే పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి కదా. అందుకే మల్లి అమ్మడు ఇటు రాబోతోందని వినికిడి.

అయితే ఇక్కడికి వచ్చి ఏ హీరోతో చేయబోతోంది? అనే డౌట్ మీకు రావొచ్చు. ఇటీవల మాషూకా అంటూ సాగే ప్రయివేట్ ఆల్బమ్ లో నర్తించిన రకుల్ ఈ పాటను సరైనోడు సహనటుడు అల్లు అర్జున్ తో లాంచ్ చేయించిన సంగతి తెలిసినదే. అక్కడే అందరికీ అనుమానం వచ్చింది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హిట్టు కొట్టి జోష్ మీదున్న అల్లు అర్జున్ తో కాస్త సన్నిహితంగా ఉంటోందని గుసగుసలు వినిబడుతున్నాయి. అయితే ఇది ఎంతవరకూ వర్కవుటవుతుంది? అమ్మడుకి మళ్ళీ తెలుగు బడా సినిమాలలో నటించే అవకాశం వస్తుందో లేదో చూడాలి మరి!

Share post:

Latest