టాలీవుడ్ సమ్మె.. ప్రభాస్ కు ఎంత నష్టమో తెలుసా?

సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.. ఆగస్టు 1వ తేదీ నుంచి టాలీవుడ్ నిర్మాతలు సమ్మె చేస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గకపోతే ఇండస్ట్రీ మనుగడ కష్టమవుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఓటీటీల్లో విడుదలకు 10 వారాల లాక్ ఇన్ పీరియడ్ అమలు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.. అయితే సమ్మె జరుగుతున్నా కూడా చాలా సినిమాల షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాల విషయంలో వారు కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది..

టాలీవుడ్ నిర్మాతల సమ్మె కారణంగా పెద్ద హీరోల సినిమాలు వాయిదా పడ్డాయి.. దాదాపు 15 చిన్నా పెద్దా సినిమాలు ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి.. ఇప్పటికే షెడ్యూల్ ప్లాన్ చేసిన పెద్ద సినిమాలన్నీ ఈ సమ్మెతో ఇబ్బందులు పడబోతున్నాయి. వాటిలో ప్రభాస్ నటిస్తున్న రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.. ప్రభాస్, నాగ్ అశ్విన్, దీపిక పదుకొనే కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రాజెక్ట్-కే, సలార్ సినిమాల షూటింగ్ లు క్యాన్సిల్ అయ్యాయి..

ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే.. సలార్ సినిమా దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. ప్రాజెక్ట్-కే ఒక అంతర్జాతీయ సినిమా కాబడ్డి బడ్జెట్ మరీ ఎక్కువగా ఉంటుంది.. ఈ రెండు సినిమాలు వాయిదా పడటంతో 20 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ప్రభాస్ డేట్లు కూడా వృథా అవుతున్నాయి. దీంతో ప్రభాస్ కి కూడా 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతుందని సమాచారం.. మొత్తానికి నిర్మాతల సమ్మె కారణంగా ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ ఎక్కువగా నష్టపోతున్నాడట..