‘మెంటల్ కృష్ణ’ మళ్ళీ వస్తాడా? ఓ సీరియల్ నటిని పట్టుకొని, నా భార్య అని అంటున్న పోసాని?

మెంటల్ కృష్ణ అనగానే తెలుగు వాళ్ళు అందరికీ గుర్తొచ్చే పేరు పోసాని కృష్ణ మురళి. అవును.. తెలుగు చిత్ర సీమలో మొదట రైటర్ గా, దర్శకుడిగా, నేడు ఆర్టిస్టుగా సోనసాగుతున్న పోసాని గురించి తెలియని వారు వుండరు. ముఖ్యంగా మెంటల్ కృష్ణ సినిమాతో పోసాని ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో తెలియంది కాదు. పోసాని ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసినదే. ప్రతి ఒక్కరు కూడా బుల్లితెర కార్యక్రమాలు చూసి ఎంటర్టైన్మెంట్ పొందడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలు ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉన్నాయని చెప్పాలి. సాధారణంగా బుల్లితెర కార్యక్రమాలకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు గెస్ట్ లుగా రావడం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక కార్యక్రమానికి సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి వచ్చి తెగ సందడి చేసాడు. అక్కడితో ఆగకుండా ఒక సీరియల్ నటినీ ఏకంగా తన భార్య అంటూ చెప్పేసాడు. దీంతో అందరూ పగలబడి నవ్వుతున్నారు.

ఈటీవీ 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘భలే మంచి రోజు’ అనేక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా గెస్ట్ గా వచ్చిన పోసాని కృష్ణ మురళి ఒక స్కిట్ చేశాడు.. ఈ క్రమంలోనే సీరియల్ యాక్టర్ యమున పోసాని దగ్గరికి వచ్చి మా పిల్లలకు సమస్య వచ్చింది పరిష్కరించమని చెబుతుంది. మీ పిల్లలే అనుకోండి అంటూ చెబుతోంది. దీంతో కల్పించుకున్న పోసాని కృష్ణ మురళి నా పిల్లలు అంటున్నారు కాబట్టి వాళ్లు పిల్లలు అయితే మీరు నా భార్య అవుతారు అంటూ పంచ్ వేస్తాడు. దాంతో అక్కడున్నవారు పగలబడి నవ్వుతారు.

Share post:

Latest