వైసీపీలో అస్స‌లు త‌గ్గేదేలే అంటోన్న ఆ ఇద్ద‌రు…!

వైసీపీలో చాలా మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది.. ఏదో ఉన్నామంటే.. ఉన్నాం.. గెలి చామంటే గెలిచాం.. అన్న‌ట్టుగానే వున్నారు. త‌ప్పితే.. ఎక్క‌డా దూకుడు ప్ర‌ద‌ర్శించడం లేదు. అంతేకాదు.. ఒక‌రిద్ద‌రు.. మాత్రం.. త‌మ‌కు ప్రాధాన్యం లేన‌ప్పుడు ఎందుకు? అనే ప్ర‌శ్న కూడా గుప్పిస్తున్నారు. ఈ నేప థ్యంలో కొంద‌రు మాత్రం త‌మ‌కు ప‌ద‌వులు ఉన్నా.. లేకున్నా.. మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. వీరే.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన‌.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.

Kodali Nani, ఏపీలో అందరి చూపు ఆయన వైపే.. దాని కోసమే వెయిటింగ్! - all eyes  on kodali nani, will he give strong reply to pawan kalyan? - Samayam Telugu

తాజాగా రెండు కీల‌క ప‌రిణామాలు.. ఏపీని కుదిపేశాయి. వీటిలో.. వైసీపీ ఒకింత డిఫెన్స్‌లో ప‌డింద‌నే వాద‌న కూడా వినిపించింది. అదే.. ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారం. దీనిపై ప్ర‌తిపక్షం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. అదే స‌మ‌యంలో అమెరికా ల్యాబ్ రిపోర్టు అంటూ.. ఒక సంచ‌ల‌న విష‌యాన్ని సైతం తెర‌మీ దికి తెచ్చింది. దీంతో వైసీపీకి మింగుడు ప‌డ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో మంత్రి పేర్ని జోక్యం చేసుకున్నారు. టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్లు ఇచ్చారు.

Chandrababu's Amaravati is a fraud: Kodali Nani - ManaTeluguMovies.net

ఇక‌, రెండో ఘ‌ట‌న‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్ తో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నాయ‌కుడు.. అమిత్ షా బేటీ అయ్యా రు. ఈ క్ర‌మంలో ఈ ప‌రిణామం.. ఏపీపై ఉంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. వైసీపీకి చెక్ పెట్టేందుకు.. ఏపీలో జూనియ‌ర్‌ను వాడుకుంటున్నార‌నే విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. ఈ స‌మ‌యంలో.. జోక్యం చేసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు. రాజ‌కీయం కోస‌మే జూనియ‌ర్‌ను షా క‌లిశార‌ని..అయితే.. దీనివ‌ల్ల ఏపీలో ఏమీ జ‌రిగిపోద‌ని.. అస‌లు జూనియ‌ర్‌ను టీడీపీనే రానివ్వ‌ద‌ని.. వ్యాఖ్యానించారు.

కొడాలి నాని చెప్పడంతో ఎన్టీఆర్ నన్ను వదిలించుకోవాలనుకున్నాడు.. కానీ  చివరికి, వివి వినాయక్ కామెంట్స్

కొస‌మెరుపు ఏంటంటే.. ప‌ద‌వులు లేక‌పోయినా..వీరు మాట్లాడిన మాట‌లు.. చేసిన వ్యాఖ్య‌లు..మీడియాలో జోరుగా వైర‌ల్ కావ‌డంతోపాటు.. వైసీపీకి కూడా ఆక్సిజ‌న్ ఇచ్చిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇత‌ర నాయ‌కులు ఉన్నా.. వారు నోరు విప్పినా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

Manacles are not pen, caste: ap ministers కలానికి కాదు, కులానికి సంకెళ్లు:  ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని - Telugu Oneindia

Share post:

Latest