పీవీ సింధు డ్రీమ్ హీరో అతనా..లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

PV సింధు పరిచయం అవసరం లేని పేరు. 27 ఏళ్ళ సింధు నిరంతర కృషి ,ఆత్మ విశ్వాసంతో ఎన్నో క్రీడల్లో పాల్గొని విజయం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారతీయ క్రీడాకారిణి సింధు స్వర్ణం సాధించింది..
ఎప్పుడూ టీవీ షోలో కనపడని సింధు అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది. తాను ఎంత పెద్ద క్రీడాకారిణి అయినా చాల సరదాగా అలీ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూ, జోక్స్ వేస్తూ సందడి చేసింది..తాను గేమ్ గెలిచినప్పుడు చేతిలో జాతీయ పథకం పట్టుకుని,మన జాతీయ గీతం వినేటప్పుడు తాను ఎంత భావోద్వేగురాలవుతానని చెప్పుకొచ్చింది .

సినిమా సమయం:
సింధు ఫేవరెట్ హీరో ఎవరు అని అలీ అడగ్గా ప్రభాస్ అని సమాధానమిచ్చింది, అప్పుడు అలీ అదే ఎత్తు అనా అని అడగ్గా నవ్వుతుంది. ప్రభాస్ ..ఇంకా అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఇష్టమేనని ఇలా చెప్తుంటే చాలా మంది వుంటారు అని కూడా చెప్పింది.
భవిష్యత్తులో హీరోయిన్ గా నటించే అవకాశం ఉందా అని అడగ్గా తన బయోపిక్ లో తనే నటిస్తానేమో అని చెప్పింది..మొత్తానికి ఎంత పెద్ద క్రీడకారిణి అయినప్పటికి సింధు చాలా చక్కగా తెలుగులో మాట్లాడటం అభినందనీయం.

Share post:

Latest