‘ జ‌ల్సా ‘ రీ రిలీజ్‌కు నో రెస్పాన్స్‌… ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మ‌తి చెడుతోందిగా…!

టాలీవుడ్ లో హీరోల‌ కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మారిన కాలంతో కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్‌లో సూపర్ హిట్ అయిన పోకిరిని మళ్లీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు వేస్తే ఈ సినిమా మళ్లీ భారీ సక్సెస్ అయింది.

14 Years Of Pokiri, The Movie Which Made Mahesh Babu A Superstar! -  Filmibeat

తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల్లో సూపర్ హిట్ అయిన ఘరానా మొగుడు సినిమాని రీ రిలీజ్ చేయగా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వ‌సూళ్లు రాలేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తుండగా… ఈ స్పెషల్ డే కి పవన్ ఫ్యాన్స్ జల్సా సినిమాని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా రెస్పాన్స్ చూస్తే ఫాన్స్ లోనే అనుకున్నంత క్రేజ్‌ లేదు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేద‌ట‌.

Watch Gharana Mogudu on ott streaming online

ఇటు ఏపీ, తెలంగాణ‌లోనూ భారీ ఎత్తున ప్రీమియ‌ర్లు ప్లాన్ చేస్తున్నా అడ్వాన్స్ బుకింగ్‌లు అయితే అనుకున్న‌ట్టుగా లేవు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దగ్గర పడుతున్నా టిక్కెట్లు బుక్ కాక‌పోవడంతో అభిమానుల్లో నిరుత్సాహం అయితే క‌నిపిస్తోంది. మెగాస్టార్ పుట్టినరోజు రోజు ఘరానా మొగుడు సినిమాకి అనుకున్నంత రెస్పాన్స్ లేకపోవడం… ఇప్పుడు జల్సా సినిమాకు కూడా అదే రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

 

Share post:

Latest