వైష్ణ‌వ్ తేజ్ 120 సార్లు చూసిన ఆ రెండు హిట్ సినిమాలు ఇవే…!

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్‌. అటు అన్న సాయిధరమ్ తేజ్ టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే అన్న బాట‌లో సినిమాల్లోకి వచ్చిన వైష్ణవి తేజ్ కు తొలి సినిమా ఉప్పెనతోన అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్టు దక్కింది. అసలు ఉప్పెన సినిమా వసూళ్లు చూసి టాలీవుడ్ స్టార్ హీరోల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక తొలి సినిమాకే ఇంత వ‌సూళ్లు రావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ట్రేడ్ వర్గాలను సైతం ఒక కుదుపు కుదిపేసింది.

Vaishnav Tej#8217;s Uppena#8217; Censor Report Is Here

అయితే వైష్ణవ్‌ రెండో సినిమా స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వైష్ణవ తేజ్ తన మూడో సినిమాగా రంగ రంగ వైభవంగా చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైల‌ర్ ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న అంచనాలే ఉన్నాయి.

Ranga Ranga Vaibhavanga Telugu Movie (2022): Cast | Trailer | Songs | OTT | Release Date - News Bugz

ఇక తాజాగా వైష్ణ‌వ్ మాట్లాడుతూ ఎందుకనో తనకు చిన్నప్పటి నుంచీ సీనియర్ల మీదే ఎక్కువ‌ క్రష్ ఉండేదని చెప్పాడు. తాను త‌న మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తమ్ముడు – బద్రి సినిమాల‌ను దాదాపు 120 – 125 సార్లు చూసినట్లు చెప్పాడు. దీనిని బ‌ట్టే మేన‌మామ సినిమాలు అంటే మ‌నోడికి ఎంత ఇష్ట‌మో తెలుస్తోంది. ఇక తాను ఉప్పెన లో చేపలు పడితే … కొండపొలం లో మేకలు పట్టానని… రంగ రంగ వైభవంగాలో అమ్మాయిలని పట్టానని సరదాగా అన్నారు.

Sale > badri telugu cinema > in stock

Share post:

Latest