ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాలో ఊహించ‌ని ట్విస్ట్‌… ఇంత క‌న్‌ఫ్యూజ్ ఏంటో…!

తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అభిమానులుకూ నిరాశగానే ఉంది. ఆ సినిమాపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా అస‌లు మొదలవుతుందా ? లేదా అన్న అయోమయంలో పడిపోయారు. ఎన్టీఆర్ తన తర్వాతే సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేస్తానని చెప్పాడు.

Koratala Siva On His Collaboration With Jr NTR For 'NTR30': "There Will Be  A Mass Overdose"

ఈ సినిమా మోషన్ పోస్టర్‌ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్లు రిలీజ్ చేశారు. కొర‌టాల ఎన్టీఆర్‌తో చేసేది పాన్ ఇండియా క‌థ అంటూ నాన్చుకుంటూ వ‌స్తున్నాడు. ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ మెదికు వెళుతుందట‌. కొరటాల తన పాత సినిమాలనకు భిన్నంగా ఈ కథను రాస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో కొంత భాగం సముద్రంలో షిప్పుల మీద నడుస్తుందట‌.

NTR 30 teaser: Check it out his fury - The Pureza

ఈ సినిమాలో మాఫియా బ్యాక్ డ్రాప్ వుంటుందని సినీ వ‌ర్గాల‌లో టాక్‌ నడుస్తుంది. ఎన్టీఆర్ -కొరటాల చేయబోయే సినిమా కోసం భారీ బ్యాక్ డ్రాప్ రెడీ చేస్తున్నాడ‌ట‌. కొరటాల ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలనే యాక్షన్ జోనర్ కథను రెడీ చేస్తున్నాడు. మొత్తం మీద కొరటాల – ఎన్టీఆర్ సినిమా గురించి ఏమీ తెలియక కింద మీద పడుతున్న అభిమానులకు ఇది ఒక కిక్ ఇచ్చే వార్త అయినా.. ఇంత లేట్ అవ్వ‌డం కాస్త బాధాక‌ర‌మే..!

Share post:

Latest