ఎన్టీఆర్ ఒకేసారి రెండు ట్విస్టులు ఇస్తున్నాడే.. ఫ్యాన్స్‌కు బంప‌ర్ న్యూసే…!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన RRR రిలీజ్ అయి నాలుగు నెలలు అవుతున్న తర్వాతి సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఎన్టీఆర్ 30వ‌ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కాగా… మొదటి సినిమా జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కొర‌టాల‌ శివ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు.

- Advertisement -

ఈ చిత్రం గురించి అధికారికంగా అనౌన్స్ కాలేదు కానీ సినిమా అయితే ఉందని రీసెంట్ కన్ఫర్మ్ అయింది.కొరటాల చిరంజీవితో తీసిన ఆచార్య సినిమా ప్లాఫ్ అవడంతో తన కెరియర్ కొంచెం చిక్కుల్లో పడింది. అదే క్రమంలో ఎన్టీఆర్ తో తీసే సినిమాతో ఎలా ? అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చాలా కష్టపడి మరి స్క్రిఫ్ట్‌ రెడీ చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కూడా మూవీ అనౌన్స్ చేశాడు. ఇదే క్రమంలో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి .

ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఎన్టీఆర్ ఒకేసారి రెండు సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. కొరటాల శివతో పాటు బుచ్చిబాబు సినిమా కూడా ఒకేసారి మొదలు పెట్టాలని చూస్తున్నాడ‌ట‌. రెండు సినిమాల షూటింగుల్లో పాల్గొనేటట్టు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాలి.

Share post:

Popular